భారతి సిమెంట్‌కు టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డు

26 Apr, 2015 02:39 IST|Sakshi
భారతి సిమెంట్‌కు టీవీ5 బిజినెస్ లీడర్ అవార్డు

హైదరాబాద్: టీవీ-5 నిర్వహించిన బిజినెస్ లీడర్-2015 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ హెచ్‌ఐసీసీలో జరిగింది. వివిధ అంశాలలో ప్రతిభ కనబరిచిన భారతి సిమెంట్ సంస్థతో పాటు, 23 విభాగాల్లో ప్రతినిధులకు అవార్డులను అందజేశారు.

మాన్యుఫాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ అండ్ ఐటీస్ తదితర రంగాల్లో అవార్డులు గెలుపొందినవారు ఈ సందర్భంగా తమ అనుభవాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు ద త్తాత్రేయ, మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జీఎంఆర్ సంస్థ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, సినీనటులు నాగార్జున, మంచులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు