భార్యాబాధితుల సంఘం సమావేశం!

30 Sep, 2018 13:54 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలో భార్యాబాధితుల సంఘం సమావేశం చర్చకు దారితీస్తోంది.  ఈ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో హైదరాబాద్‌ లేదా బెజవాడలో భార్యాబాధితులతో 1కే రన్‌ నిర్వహించాలని అనుకుంటున్నారు. కొన్ని చట్టాలను అనకూలంగా చేసుకుని భార్యలు తమ భర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. సెక్షన్‌ 498 కేసు ఉన్నా ఏడాది తర్వాత రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలని.. మెయింటెన్స్‌, డొమెస్టిక్‌ వయలెన్స్‌ను చట్టం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు