భీమిలిలో టీడీపీకి ఎదురుదెబ్బ

4 Oct, 2019 04:45 IST|Sakshi

మంత్రి ముత్తంశెట్టి సమక్షంలో పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిక

భీమునిపట్నం: భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి నుంచి ఆ పార్టీ వెన్నంటి ఉన్న నాయకులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అవినీతి లేని స్వచ్ఛ పాలన అందిస్తున్నందునే అందరూ పార్టీలోకి వస్తున్నారన్నారు. ఇప్పటి వరకు టీడీపీకి కంచుకోటగా చెబుతున్న ఈ నియోజకవర్గం ఇకపై వైఎస్సార్‌సీపీకి కంచుకోట అన్నారు.

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీలో చేరిన వారిలో భీమిలి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ వెంకటప్పడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బంటుపల్లి మణిశంకర్‌నాయుడుతోపాటు ఆనందపురం మండల టీడీపీ అధ్యక్షుడు బీఆర్‌బీ నాయుడు, ఆనందపురం టీడీపీ మాజీ అధ్యక్షుడు కాకర రమణ, భీమిలి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి గుడాల ఎల్లయ్య, భీమిలి మండల తెలుగు యువత అధ్యక్షుడు తాతినాయుడుతోపాటు ఆనందపురం, భీమిలి మండలాలకు చెందిన పలువురు మాజీ సర్పంచ్‌లు, ముఖ్య నాయకులు ఉన్నారు. 

>
మరిన్ని వార్తలు