అఖిలప్రియ, సుజయ బాధ్యతల స్వీకరణ

14 Apr, 2017 17:51 IST|Sakshi
అఖిలప్రియ, సుజయ బాధ్యతల స్వీకరణ

అమరావతి: ఇటీవల మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన భూమా అఖిలప్రియ, సుజయ కృష్ణ రంగారావులు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పర్యాటక శాఖ మంత్రిగా అఖిలప్రియ, గనుల శాఖ మంత్రిగా సుజయ కృష్ణ రంగారావులు తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు.  పేద కళాకారులకు ఆర్థిక సాయం చేసే ఫైల్‌పై అఖిలప్రియ తొలి సంతకం చేశారు. టెంపుల్‌ టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఆమె చెప్పారు. త్వరలో విశాఖ నుంచి అరకు వరకు పర్యాటక రైలు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. జీఆర్‌డీ, జీకేఆర్‌, మినర్వా గ్రాండ్, బాలాజీ రిసార్డ్స్‌తో ఎంవోయూల ఫైల్‌పై సంతకం చేశారు. ఏపీటీటీసీ యాప్‌ను ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు