చైతన్య రథసారథి

15 Apr, 2020 09:46 IST|Sakshi

తిరుపతి తుడా:కరోనాపై యుద్ధంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిరంతరం ప్రజలకు అవగాహన కలిగిస్తూ.. ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా  తమ ప్రాణాలకు తెగించి నగరంలో విధులు     నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం స్వయంగా చెత్త సేకరణ రిక్షా తొక్కుతూ.. వారిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఆయన ప్రధాన కూడళ్లకు వెళ్లి ప్రజలకు కరోనా తీవ్రతను వివరించారు.

మరిన్ని వార్తలు