ప్రజా సంకల్ప యాత్ర చారిత్రక ఘట్టం కావాలి

21 Nov, 2018 08:15 IST|Sakshi
పాదయాత్ర సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న కరుణాకర రెడ్డి, చిత్రంలో ధర్మాన కృష్ణదాస్, పాలవలస రాజశేఖర్, రెడ్డి శాంతి, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే కళావతి, గొర్లె కిరణ్‌ తదితరులు

ఆఖరి జిల్లా పర్యటనతో అధికారం చేపట్టాలి

వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి

పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన నాయకులు  

శ్రీకాకుళం, పాలకొండ/పాలకొండ రూరల్‌: జిల్లాలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టనున్న ప్రజాసంకల్ప యాత్ర చారిత్రక ఘట్టంగా నిలిచిపోవాలని, ఎన్ని తరాలు మారినా మర్చిపోలేని రీతిలో స్వాగతం పలికి చిరస్థాయిలో గుర్తుం డిపోయేలా ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 25 పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలం కెల్ల గ్రామం అడుగుపెడుతున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అధ్యక్షతన పాలకొండలో సన్నాహక సభ నిర్వహించారు. ఈ సం దర్భంగా భూమన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ప్రజల కోసమే అహోరాత్రాలు పోరాడుతున్నారని అన్నారు. ఏడాది కాలంగా జనమే కుటుంబంగా ముందుకు కదులుతున్నారని తెలిపారు. 12 జిల్లాల్లో సంకల్పయాత్ర విజయవంతంగా జరిగిందని, ఇంత కంటే శ్రీకాకుళం జిల్లాలో సంకల్ప యాత్ర ప్రభంజనంలా మారాలని కోరారు. కుట్రలు, కు తంత్రాలకు ప్రజా సమూహమే సమాధానం కా వాలని తెలిపారు. సిక్కోలు పాదయాత్ర వైఎ స్సార్‌ సీపీ అధికారం చేపట్టేందుకు నాంది కావా లని ఆకాంక్షించారు. పార్టీ అధ్యక్షుడే అంత కష్టపడుతున్నప్పుడు కార్యకర్తలు, నాయకులు ఇంకెంత కష్టపడాలో తెలుసుకోవాలన్నారు. పాలకొండలో ఈ నెల 28న జరగనున్న బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపాలని కోరారు.

పాలకొండ రెవెన్యూ డివిజన్‌లోని మూడు నియోజకవర్గాల్లో సంకల్పయాత్ర విజయవంతం చేయాల్సిన బాధ్యతలు రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌ చేపట్టాలని తెలిపారు. సమావేశంలో పార్టీ నాయకులు సీదిరి అప్పలరాజు, పేడా డ తిలక్, గొర్లె కిరణ్, తమ్మినేని చిరంజీవినాగ్, చల్లా రవికుమార్, చింతాడ మంజు, మామిడి శ్రీకాంత్, కామేశ్వరిలతో పాటు నియోజకవర్గ నాయకులు దమలపాటి వెంటరమణనాయుడు, కనపాక సూర్యప్రకాష్, జి.సుమిత్రరావు, పి.సింహాచలంలతో పట్టణ నాయకులు వెలమల మన్మధరావు, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు, నీలాపు శ్రీనివాసరావు, నల్లి శివప్రసాద్, చందక జగదీష్, పాటు జిల్లాలో మండల కన్వీనర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

అభిమానం చూపండి
వైఎస్‌ కుటుంబంపై జిల్లా వాసులకు ఎనలేని మక్కువ ఉంది. రెండుసార్లు వైఎస్సార్‌ను ముఖ్యమంత్రి చేయడంలో జిల్లావాసులు కీలకపాత్ర పోషించారు. అదే అభిమానాన్ని మళ్లీ జగన్‌పైనా చూపండి. ఆయన జిల్లాలో అడుగు పెట్టగానే ఇచ్చే స్వాగతం అందరికీ స్ఫూర్తి కలిగించాలి. జిల్లా శ్రేణులు అంతా 25న వీరఘట్టం మండలం చేరుకోవాలి.   – ధర్మాన ప్రసాదరావు,పార్టీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌

గ్రామస్థాయిలో కదిలిరావాలి
ప్రజా సంకల్ప యా త్రకు ప్రతి గ్రామం నుంచి జనం కదిలి రావాలి. గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలను స్వాగత సభ కు ఆహ్వానించాలి. పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనేలా ఏర్పాటు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే కళావతిపై ఉన్న అభిమానం అందరికీ తెలియాలి.– తమ్మినేని సీతారాం, పార్టీ  శ్రీకాకుళం పార్లమెటరీ జిల్లా అధ్యక్షుడు

సిక్కోలు అభిమానం చూపుదాం
కడప తర్వాత వైఎస్‌ కుటుంబానికి సిక్కోలుతో అంత అనుబం ధం ఉంది. రాష్ట్రంలో అరాచక పాలన అంతం కావాల్సి ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే అది సాధ్యం. ప్రజలంతా జగన్‌ను ఆశీర్వదించాలి.
– కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే

స్ఫూర్తిగా నిలవాలి
ప్రతి నియోజకవర్గం తమ సొంత నియోజకవర్గంలా భావిం చి నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొనాలి. జిల్లాలో పాదయాత్ర ముగింపు కానున్న నేపథ్యం స్ఫూర్తిగా నిలవాలి.              – పాలవలస రాజశేఖరం, వైఎస్సార్‌ సీపీరాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు

నాయకులై నడిపించండి
ప్రజల కోసం అలుపు లేకుండా పాదయాత్ర చేస్తున్న జగన్‌కు మనం ఉన్నామనే భరోసా కల్పించాలి. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు బాధ్యత తీసుకుని నాయకత్వం వహించి యాత్ర విజయవంతం చేయాలి.
– పాలవలస విక్రాంత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి

జిల్లా సత్తా చూపించాలి
జిల్లాలో వైఎస్సార్‌ సీపీ సత్తాను పాదయాత్రలో చాటిచెప్పాలి. ప్రజల్లో జగన్‌పై ఉన్న అభిమానం పాదయాత్రలో చూపించాలి. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నవారిని ఆహ్వానించాలి.
– దువ్వాడ శ్రీనివాసరావు, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త

విజయ ఢంకా మోగించాలి
ప్రజా సంకల్ప యాత్ర స్ఫూర్తితో జిల్లాలో 10 నియోజకవర్గాల్లో పార్టీ విజయఢంకా మోగించాలి. సంకల్ప యాత్ర విజయంతోనే  విజయం అందుకోవాలి. ప్రజలు జగనన్న కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వారి అభిమానం అందుకోవాలి.– రెడ్డి శాంతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాతపట్నం నియోజకవర్గ సమన్వకర్త

కంకణబద్ధులు కావాలి
ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో ముందుగా నా నియోజకవర్గంలో ప్రారంభం కావడం నా అదృష్టం. జగనన్న మనపై ఉంచిన నమ్మకానికి బహుమతిగా జన సందోహం పాదయాత్రకు తరలిరావాలి. నభూతోనభవిష్యతి అన్న విధంగా పాదయాత్ర జరగాలి.– విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే

వజ్రసంకల్పం సడలిపోకుండా..
వజ్ర సంకల్పం సడలి పోకుండా జిల్లాలోని మిగిలిన 9 నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు స్వాగత సభకు హాజరుకావాలి. పాలకొండ నియోజకవర్గంలో బహిరంగ సభ విజయవంతంగా జరిపించాలి. ఇందుకు అన్ని స్థాయిల్లో పార్టీ నాయకులు పనిచేయాలి.– ధర్మాన కృష్ణదాస్, పీఏసీ సభ్యుడు

మరిన్ని వార్తలు