భద్రం బీకేర్‌ ఫుల్‌ బ్రదరూ.. డ్రైవింగ్‌లో జాగ్రత్త గురూ..

29 Jan, 2019 08:07 IST|Sakshi
వెనుక నుంచి మోటారు సైక్లిస్ట్‌ ఢీకొట్టడంతో కిందపyì పోయిన ముందున్న వాహనచోదకులు

తూర్పుగోదావరి,మండపేట :అప్రమత్తంగా లేకపోతే అన్నీ అనర్థాలే.. అన్నీ అపాయాలే.. దీనికి నిదర్శనమే ఈ చిత్రాలు..రాజమహేంద్రవరం నుంచి రామచంద్రపురం వైపు వెళుతున్న ఇండికా వాహనం మంగళవారం స్థానిక పెద కాలువ వంతెన వద్దకు వచ్చేసరికి ముందుకు వెళుతున్న టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతినగా కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని గమనిస్తున్న మోటారు సైక్లిస్ట్‌ చూసుకోకుండా ముందు మోటారు సైకిల్‌పై వెళుతున్న వారిని ఢీకొట్టడంతో ఇదిగో వారు ఇలా కింద పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయా ప్రమాదాల్లో ఎవరికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు