ఆ బాట.. జనం భావి భాగ్యరేఖ..

25 Sep, 2018 13:47 IST|Sakshi

3,000 కిలోమీటర్ల మజిలీని చేరిన జననేత పాదయాత్ర

 చారిత్రక సందర్భంలో ‘తూర్పు’న పార్టీ శ్రేణుల సంబరాలు

అచ్చం అలనాడు.. పెద్దాయన వైఎస్సార్‌పై కురిపించినట్టే.. ఇప్పుడు ఆయన తనయుడిపైనా మమతాభిమానాల జడివాన కురిపిస్తున్నారు జనం. అప్పుడాయన అడుగుల్లో తమ రేపటి అభ్యుదయం జాడను చూసుకున్నట్టే ఇప్పుడు జననేత నడిచిన బాటలో తమ భావిభాగ్యాన్ని చూసుకుంటున్నారు. ఆ జనం చూపే ప్రేమాదరాలతో.. వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా నడుస్తున్నారు జగన్‌. జనం బతుకులోని వెతలు, గతుకులను అధ్యయనం చేస్తూ, కమ్ముకున్న చీకటిలో పొడిచిన పొద్దులా వారి కళ్లలో కొత్త వెలుగులు నింపుతూ ఆయన సాగిస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం విజయగనరం జిల్లా కొత్తవలసలో 3,000 కిలోమీటర్ల మజిలీని చేరుకుంది. ఈ చారిత్రక సందర్భంలో జిల్లాలో పలుచోట్ల పార్టీ శ్రేణులు వేడుక జరిపాయి.  

తూర్పుగోదావరి, కాకినాడ:  ప్రజాసంకల్ప  యాత్ర మూడువేల కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా  జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. అనేక నియోజకవర్గాల్లో పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు కేకులు కట్‌ చేసి సందడి చేశారు. దేశంలో మునుపెన్నడూ ఏ నాయకుడూ చేయని రీతిలో సుదీర్ఘ యాత్రలో అలుపెరగని పథికునిగా ప్రజలతో మమేకమవుతూ జననేత జగన్‌ సాగిస్తున్న పాదయాత్ర మూడువేల కిలోమీటర్లకు చేరిన సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు స్వీట్లు పంచి ఆనందం పంచుకున్నారు. తమ అభిమాన నేత యాత్ర మరింత జయప్రదంగా సాగాలని ఆకాంక్షిస్తూ సంబరాలు జరుపుకొన్నారు. 

దేశంలోనే చారిత్రక ఘట్టం : బోస్‌
∙రాజోలు నియోజకవర్గం మలికిపురంలో కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు,  ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ కేక్‌ కట్‌ చేశారు. పార్టీ శ్రేణులు, ప్రజలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బోస్‌ మాట్లాడుతూ జగన్‌ పాదయాత్ర మూడువేల కిలోమీటర్లు పూర్తి కావడం దేశ చరిత్రలోనే చారిత్రక ఘట్టమన్నారు. అమలాపురంలో పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,  నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పినిపే విశ్వరూప్‌  కేక్‌ కట్‌ చేశారు. 

కాకినాడ సిటీలో కో ఆర్డినేటర్‌ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 44వ డివిజన్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌కట్‌ చేశారు. నగరాధ్యక్షుడు కుమార్‌ 
తదితరులు పాల్గొన్నారు. 

ప్రత్తిపాడు నియోజకవర్గం అన్నవరంలో కో ఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య  కేకు కట్‌ చేశారు. అన్నవరంలో జరిగిన వేడుకల్లో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా వైఎస్సార్‌సీపీ  అధ్యక్షుడు రాజీవ్‌శర్మగుప్త  సత్యదేవునికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులకు జగన్‌ ఫొటోతో, వైఎస్సార్‌ గుర్తులతో ఉన్న  నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం బి.దొడ్డవరంలో  కో ఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు కేక్‌ కట్‌ చేశారు. 

పెద్దాపురం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, అభిమానుల మధ్య నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావు నాయుడు భారీ కట్‌ చేశారు.   శివాలయంలో పూజలు చేశారు. సామర్లకోటలో పార్టీ నాయకుడు దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. సిరిమానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేశారు. 

జగ్గంపేట పార్టీ కార్యాలయంలో కో ఆర్డినేటర్‌ జ్యోతుల చంటిబాబు కేక్‌ కట్‌ చేశారు. స్థానికులకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు  స్వీట్లు పంచారు. 

రాజమహేంద్రవరం రూరల్‌లో సర్వమత ప్రార్థనలు
రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం ధవళేశ్వరంలో కో ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత వెంకటేశ్వరస్వామి ఆలయంలో, అనంతరం చర్చి, మసీదుల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం  బైక్‌ ర్యాలీ నిర్వహించారు. రాజవోలులో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు ఆధ్వర్యంలో ఆకుల వీర్రాజు  కేక్‌కట్‌ చేశారు. 

 పిఠాపురం పార్టీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు బొజ్జా రామయ్య ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మండలం కోలంకలో కో ఆర్డినేటర్‌  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు స్వీట్లు పంచారు.

తుని నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, పట్టణంలో పార్టీ శ్రేణులు  సంబరాలు జరుపుకొన్నారు. ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు వేడుకల్లో పాల్గొన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం చిన్నదొడ్డిగుంటలో కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్త ల మధ్య కేక్‌ కట్‌ చేశారు. అనంతరం కార్యకర్తలకు, ప్రజలకు స్వీట్లు పంచారు.

మరిన్ని వార్తలు