బైక్‌ల దొంగకు బ్రేక్

2 Jun, 2014 01:26 IST|Sakshi
బైక్‌ల దొంగకు బ్రేక్

విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: చిన్న వయసులో జల్సాలకు అలవాటు పడ్డాడు. అందు కు సులువైన మార్గం బైక్‌లు దొంగిలించి అమ్మడాన్ని వృత్తిగా ఎంచుకున్నాడు.  చివరికి పోలీసులు అతని దొంగతనాలకు బ్రేక్ వేశారు. సీతానగరం మండలం కోట శ్రీరామపురానికి చెందిన కోట శివకుమార్ (26) రెండు జిల్లాల్లో 18 బైక్‌లను దొం గతనం చేశాడు. వాటిలో 17బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్ అలియాస్ శివ తొలుత విశాఖ పట్నంలోని ఓ మెడికల్ షాపులో పనిచేస్తూ యజమాని ఇంట్లో దొంగతనానికి పాల్పడడంతో పని నుంచి తొలగించారు. అప్పటినుంచి చెడు వ్యసనాలకు బానిసైన శివకుమార్ బైక్‌లు దొంగతనం చేస్తూ వాటిని అమ్మగా వచ్చే డబ్బులతో జల్సా చేసేవాడు. విశాఖపట్నం, విజయనగ రం జిల్లాల్లోని పలు పోలీసు స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసుల్లో శివకుమార్ ప్రధాన ముద్దాయి. 11 ద్విచక్ర వాహనాలకు సంబంధించిన కేసులు అతనిపై నమో దై ఉన్నాయి. మిగిలిన ఏడు వాహనాలకు సంబంధించి యజ మానులను గుర్తించాల్సి ఉంది.
 
 శనివారం పట్టణంలోని జేఎన్‌టీ యూ కళాశాల వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా శివకుమార్ వాహనంతో పట్టుబడ్డాడు. వాహనానికి సంబంధిం చిన ధ్రువీకరణ పత్రాలు అతని వద్ద లేకపోవడంతో అనుమానం వచ్చి విచారణ చేశారు. విచారణలో 18 బైక్‌లను దొంగిలించినట్లుగా నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని నుంచి 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో బైక్‌ను స్వాధీ నం చేసుకోవాల్సి ఉంది. కరకవలస సమీపంలోని భవనంలో 8 బైక్‌లు, ఫూల్‌బాగ్‌కాలనీలో 5 బైక్‌లు, కేఎల్ పురం సమీపంలో 4 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని శివకుమార్‌ను అరెస్ట్ చేశారు. బైక్‌ల దొంగను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన ఒకటో పట్టణ సీఐ కె.రామారావు, ఎస్సై బి.రమణ య్య, సీసీఎస్ సీఐలు ఎస్.వాసుదేవ్, కుమార్‌స్వామి, ఎస్సై ఐ. సన్యాసిరావు, సీసీఎస్ హెచ్‌సీలు మజ్జి.రామకృష్ణ, రాజు, పి.జగన్మోహనరావు, ఎం.రామకృష్ణ, ఎల్.గోపాల్, మహేష్, కానిస్టేబుళ్లు నాగేంద్రప్రసాద్, పి.పాపారావు  ఎస్. కిరణ్‌కుమార్‌లను విజయనగరం డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు.
 
 దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు
 ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్  ఆదివారం పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని,బైక్‌లను విలేకరుల ముందు ప్రవేశ పెట్టారు, అనంతరం ఆయన మాట్లాడుతూ దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలు ఇతర ప్రదేశాలకు వెళ్లిన సమయాల్లో పోలీసులకు సమాచారం అందిస్తే అటువంటి ఇళ్లకు ప్రత్యేక గస్తీ ఏర్పాటు  చేస్తామని భరోసా ఇచ్చారు. దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామన్నా రు. బైక్‌లను పార్కింగ్ చేసే సమయాల్లో హ్యాండ్‌లాక్  వేసేలా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
 

>
మరిన్ని వార్తలు