దుర్గగుడిలో బయోమెట్రిక్

26 Mar, 2016 01:48 IST|Sakshi
దుర్గగుడిలో బయోమెట్రిక్

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి..
 
ఇంద్రకీలాద్రి :  శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో బయోమెట్రిక్ విధానం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానుంది. రెండు రోజులుగా సిబ్బంది వివరాలు బయోమెట్రిక్ పరికరాలలో నమోదు చేస్తున్నారు. ఆలయ అధికారులు, ఉద్యోగులు, అర్చకుల హాజరును బయోమెట్రిక్ విధానంతోనే ఇకపై తీసుకుంటారు. రెగ్యులర్ సిబ్బందితో పాటు ఎన్‌ఎంఆర్, అవుట్ సోర్సింగ్  సిబ్బంది వివరాలను బయోమెట్రిక్  పరికరాలలో నమోదు చేస్తున్నారు.

సిబ్బంది బొటన వేలితో పాటు చూపుడు వేలి ముద్ర, ఐరీష్, ఫేస్ రీడింగ్ ద్వారా హాజరు తీసుకునేలా సాప్ట్‌వేర్ పొందుపరిచారు. దేవస్థానంలో మొత్తం 306 రెగ్యులర్, 60 మంది ఎన్‌ఎంఆర్, 35 మంది అవుట్ సోర్సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో వీరి హాజరు పట్టికలను దేవస్థాన సమాచార కేంద్రంలో అందుబాటులో ఉంచేవారు. బయోమెట్రిక్ పరికరాలను దేవస్థాన సమాచార కేంద్రంతో పాటు శివాలయం, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉంచుతున్నారు.

మరిన్ని వార్తలు