-

ఇక కోర్టుల్లోనూ బయోమెట్రిక్‌ యంత్రాలు

2 May, 2019 13:36 IST|Sakshi
జిల్లా కోర్టులో బయోమెట్రిక్‌ యంత్రాన్ని ప్రారంభిస్తున్న ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌

జిల్లా వ్యాప్తంగా 36 బయోమెట్రిక్‌ మిషన్‌లు

బయోమెట్రిక్‌ను ప్రారంభించిన ప్రధాన న్యాయమూర్తి

లీగల్‌(కడప అర్బన్‌): జిల్లా వ్యాప్తంగా ఉన్న 35 కోర్టులలో రూ.9 లక్షల రూపాయల వ్యయంతో 36 బయోమెట్రిక్‌ యంత్రాలను ప్రారంభిస్తున్నామని, తద్వారా అధికారులు, ఉద్యోగులంతా బాధ్యతగా విధులు నిర్వహిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ యంత్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కోర్టు ఆవరణంలో రెండు బయోమెట్రిక్‌ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. అన్ని విభాగాల కోర్టులకు సంబంధించిన మెజిస్ట్రేట్‌లు, న్యాయశాఖ అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు ఉదయం 10 గంటలకు సాయంత్రం 5 గంటల తరువాత తమకు ఇచ్చిన గుర్తింపు కార్డు ఆధారంగా ఈ యంత్రానికి అనుసంధానం చేసి ఉంటారన్నారు.

తమ చేతివేలి ముద్రలను నమోదు చేయాలని, వేలి ముద్రలు అరిగిపోయిన వారికి త్వరలో కళ్లు (ఐరిష్‌) విధానం ద్వారా విధులకు హాజరైనట్లుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ యం త్రానికి ఐరిష్‌ యంత్రం స్క్రీన్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగులు, సిబ్బంది పాటిం చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బీఎస్‌వీ హిమబిందు, ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి అరుణసారిక, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస శివరాం, డీఎల్‌ఎస్‌ఏ జిల్లా కార్యదర్శి సీఎన్‌ మూర్తి, శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ విష్ణుప్రసాద్‌ రెడ్డి, న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు