కొల్లేరు సమీపంలో పక్షుల దొంగ అరెస్ట్

10 Feb, 2016 19:33 IST|Sakshi
వేటాడిచంపిన పక్షులతో నిందితుడు ప్రశాంత్

కైకలూరు: ప్రఖ్యాత కొల్లేరు సరస్సులో ఆశ్రయం పొందుతున్న అరుదైన పక్షులను రహస్యంగా వేటాడుతూ, వాటిని హోటళ్లకు అమ్ముతోన్న దొంగను బుధవారం ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని  కొల్లేరు అభయారణ్యం ఇంగిలిపాకలంకలో రేవల్లి ప్రశాంత్ అనే దొంగను అదుపులోకి తీసుకున్నట్లు ఫారెస్టు బీట్ ఆఫీసర్ వెంకన్న తెలిపారు. పక్షుల దొంగతనాలకు పాల్పడుతోన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిసింది.


గార్‌విట్,కామన్‌టీల్,విజిటింగ్ టీ ల్, నార్తరన్ పిన్ టైల్, గార్బిలిట్ లాంటి సుమారు 42 పక్షులను విషప్రయోగం ద్వారా చంపిన దొంగలు.. వాటి మాంసాన్ని రూ.200కు పైగా హోటళ్లకు అమ్ముతుంటారని, హోటళ్ల యజమానులు పక్షుల మాంసాన్ని అధిక ధరలకు కస్టమర్లకు విక్రయిస్తుంటారని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు