‘యువకులు రక్తదానానికి ముందుకు రావాలి’

15 Feb, 2020 14:03 IST|Sakshi

సాక్షి, విజయవాడ: రెడ్‌ క్రాస్ సొసైటీ గిన్నిస్ రికార్డ్ సాధించేందుకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ఎనిమిది గంటలు నిర్విరామంగా రక్తదానం కోసం సంతకాల సేకరణ చేపట్టడం శుభపరిణామం అని ఆయన తెలిపారు. లయోలా కళాశాలలోని దేవయ్య మెమోరియల్ ఆడిటోరియంలో నిర్వహిం‍చిన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రపంచ వ్యాప్తంగా 97 మిలియన్ల వాలంటీర్లను రెడ్ క్రాస్సంస్థ  కలిగి  ఉందన్నారు.  

ఏపీలో 13 జిల్లాల్లో 132 శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలో  రెడ్ క్రాస్ లక్షా 24 వేల మంది వాలంటీర్లను కలిగి ఉందని ఆయన తెలిపారు. యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషదాయకమన్నారు. వంద ఏళ్లుగా రెడ్ క్రాస్ సొసైటీ సర్వీస్ చేస్తోందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో పేషేంట్లకు రక్తం అందించే అతిపెద్ద స్వచ్చంద సంస్థ రెడ్ క్రాస్ అని గవర్నర్‌ కొనియాడారు. రక్త దాతల నమోదు ప్రక్రియాలో పాల్గొని విద్యార్థులు ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. 

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల నుండి సంతకాల సేకరించి 28 రోజుల్లో రాష్టంలో ఏ రెడ్‌క్రాస్ బ్రాంచ్లో అయినా రక్తాన్ని డోనేట్ చేసేలా సొసైటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎనిమిది గంటల పాటు నిర్విరామంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిన్నిస్ రికార్డులో 30 కళాశాల విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొని.. 1500 వందల సభ్యుత్వాలు నమోదు చేశారు. దీంతో  గిన్నిస్ రికార్డ్ సాధ్యమని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధి రిషి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు  ఎంపీ కేశినేని నాని, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు