రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణం

23 Jun, 2016 23:02 IST|Sakshi

‘సత్రం’ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలి-
విజయవాడలో బీజేపీ ధర్నా


విజయవాడ (గాంధీనగర్) : సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ విజయవాడ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయ భూములను పరి రక్షించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలోని అలంకార్ సెంటర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసం మాట్లాడుతూ.. ఎకరం రూ. 50 లక్షల విలువచేసే సదావర్తి సత్రం భూములను కేవలం రూ. 22 లక్షలకే టీడీపీ నాయకులు బినామీల పేర్లతో కాజేయడం దారుణమన్నారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద ్ద భూ కుంభకోణమని చెప్పారు.

ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కారణి సుబ్రహ్మణ్యం ఆర్ముగమ్ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తే ఈ భూ కుంభకోణంలో ఉన్నారని విమర్శించారు. సత్రం’ భూముల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని, లేనిపక్షంలో తామే బీజేపీ జాతీయ కమిటీకి తెలియజేసి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర నాయకులు పువ్వాడ మాలకొండయ్య, ఎల్.ఆర్.కె.ప్రసాద్, ఎ.వి.రంగారావు, నగర ప్రధాన కార్యదర్శి తోట శివనాగేశ్వరరావు, రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు