ఎవరైనా బీజేపీలో చేరొచ్చు

16 Jul, 2019 09:44 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సురేంద్రరెడ్డి

భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): భారతీయ జనతాపార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, ఇతర పార్టీలకు చెందినవారు పార్టీలో చేరవచ్చని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌.సురేంద్రరెడ్డి పేర్కొన్నారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరూ 100 మంది చేత బీజేపీ సభ్యత్వం తీసుకునేలా కృషి చేయాలని తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం బీజేపీ, మైనార్టీ మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్‌కే అబ్దుల్‌రహీం అన్సారీ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి ఆలిండియా వక్ఫ్‌బోర్డు సభ్యులు, పలువురు జాతీయ మైనార్టీ నాయకులు నగరానికి రానున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్న వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తులు, త్రిబుల్‌తలాక్‌పై విస్త్రతంగా సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బుధవారం నెల్లూరు వస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ నెల 7వ తేదీ నుంచి అన్ని మండల, నగర స్థాయిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించి, ఇప్పటి వరకు 10 వేల మందికి నూతన సభ్యత్వాలు ఇవ్వటం జరిగిందన్నారు. నెల్లూరు జిల్లాకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ఇన్‌చార్జిలుగా రాష్ట్ర నాయకులు గడ్డం లక్ష్మీనారాయణ, చక్రవర్తిని నియమించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేఈపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, నగర అధ్యక్షుడు మండ్ల ఈశ్వరయ్య, కాయల మధు, మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎస్‌కే అబ్దుల్‌ రహీం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే చాంద్‌బాషా పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆహాఏమిరుచి..అనరామైమరచి

గ్రామ సచివాలయ ఉద్యోగాలోచ్‌..!

కర్కశత్వానికి చిన్నారుల బలి

జీతాలు ఎగ్గొట్టిన టీడీపీ

విశాఖలో టీడీపీ పంచాయితీ

తిన్నది.. కరిగిద్దామిలా..!

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

బంధాన్ని మరిచి..ఇంటిని విడిచి...

అర్ధరాత్రి కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

సీఎం జగన్‌ స్పందనతో అక్రమాల పుట్ట కదులుతోంది

సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం

మంచి ఆహారంతోనే ఆరోగ్యం

గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు

చెప్పుతో సమాధానమిచ్చినా మారలేదు

దేశాయ్‌ చెరువులో మట్టి దొంగలు 

మాట ఇస్తే.. మరచిపోడు

ఆ ఉత్తర్వులను రద్దు చేయండి

ఏపీ సెంట్రల్‌ వర్సిటీకి రూ.450 కోట్లు

నేడు ఆలయాల మూసివేత

ప్రాణాలు తీసిన స్టాపర్‌

మూగబోయిన విప్లవ గళం

కులాల మధ్య టీడీపీ చిచ్చు 

శునకంతో మార్జాలం.. బహు ఇంద్రజాలం

వైరల్‌.. రియల్‌ 

రైలు వచ్చిందా.. ప్రాణం గోవిందా! 

ఎస్కేయూ, ద్రవిడ వీసీలకు  హైకోర్టు నోటీసులు 

ఆశలను ఆవిరి చేసిన అగ్నిప్రమాదం

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ప్రాణం తీసిన బిందె

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం