టీడీపీ హయాంలోనే అమ్మకాల నిర్ణయం

26 May, 2020 20:19 IST|Sakshi

సాక్షి,  ఆంధ్రప్రదేశ్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల అమ్మకాలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గుట్టు విప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే (2016) టీడీపీ, బీజేపీ కలిసి టీటీడీ ఆస్తులు అమ్మాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీని కోసం నియమించిన కమిటీలో బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి కూడా సభ్యుడిగా ఉన్నారని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో తమ పార్టీకి చెందిన నాయకుడు దేవాదాయ శాఖకు మంత్రిగా ఉన్నారని, చంద్రబాబు హయాంలోనే ఆస్తుల అ‍మ్మకాల నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. నిరర్థక ఆస్తుల అమ్మకాలపై గత ప్రభుత్వ తీర్మానాన్ని నిలుపుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి సుబ్రహ్మణ్య స్వామి ధన్యవాదాలు తెలిపారు. (2016 టీటీడీ బోర్డు నిర్ణయం నిలుపుదల)

కాగా గత వారం రోజులుగా టీడీపీ ఆస్తులపై ప్రతిపక్ష టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో సాక్షి టీవీతో మాట్లాడారు. ‘తిరుమల ఆస్తుల అమ్మకంపై టీడీపీ, బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిపైన అబద్ధాలు చెప్పడం సరైనది కాదు. రాజకీయాల్లో నిజాయితీ ముఖ్యం. అబద్ధాలు చెబితే దొరికి పోక తప్పదు. సీఎం వైఎస్‌ జగన్ విశ్వసనీయత కలిగిన వ్యక్తి. చెప్పింది చేసి.. సూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి . క్రిస్టియన్ అయినంత మాత్రాన ప్రభుత్వంపై బురద జల్లడం మంచిది కాదు. చంద్రబాబు ఈ రాజకీయాలు మానుకోవాలి. బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి. తిరుమల ఆస్తులను అమ్మకూడదు. వాటిని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని, ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాను.’ అని అన్నారు. (అవన్నీ నిరర్థక ఆస్తులే)

కాగా టీటీడీపై గతంలోనూ సుబ్రహ్మణ్య స్వామి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో ఆలయ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలని తన పిటిషన్‌లో ప్రస్తావించారు. దీనిపై ఆయన సుప్రీంను సైతం ఆశ్రయించగా.. హైకోర్టుకు వెళ్లమని న్యాయస్థానం సూచించింది.

మరిన్ని వార్తలు