మిత్రపక్షాల మధ్య విబేధాల్లేవ్

3 Sep, 2014 01:50 IST|Sakshi
మిత్రపక్షాల మధ్య విబేధాల్లేవ్

తణుకు : బీజేపీ, టీడీపీల మధ్య విబేధాలు లేవని, అలా ఎవరైనా మాట్లాడితే అవి వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని బీజేపీ నేత, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. మంగళవారం తణుకు వచ్చిన సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు.  టీడీపీ, బీజేపీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని, కలిసే పనిచేస్తున్నామన్నారు. మోడి ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనధనయోజన పథకం ద్వారా పేదలకు ఎంతో లబ్దిచేకూరుతుందన్నారు. ప్రమాదబీమాతోపాటు రూ.5వేలు ఓవర్‌డాఫ్ట్‌గా పొందే సౌకర్యం ఉందన్నారు.
 
 ఇప్పటికి ఈ పథకం ద్వారా సుమారు రెండుకోట్లు మంది బ్యాంక్ ఖాతాలు పొందారన్నారు. నిడదవోలు-నరసాపురం రైల్వే లైన్ డబ్లింగ్ పనులు త్వరితగ తిన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిత్యవసరాల ధరల పెరుగుదలపై స్థానిక విలేకరులు ప్రశ్నించగా, ప్రభుత్వం ధరల అదుపునకు చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే వాటి ఫలితాలు ప్రజలకు చేరువవుతాయన్నారు. ఉల్లిధర నియంత్రణతోపాటు కూరగాయల పంటల సాగుకు ప్రోత్సాహం అందేలా ఉద్యాన శాఖ అధికారులు అన్నిరకాల చ ర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. తణుకులో మూసిన రైల్వే గేటు తెరిపించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఉపాధ్యక్షులు మంత్రిరావు వెంకటరత్నం, బీజేపీ రాష్ట్ర నాయకులు వీవీఎస్ వర్మ పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా