బ్లాక్ టికెట్ల విక్రేతలు అరెస్టు

8 Aug, 2015 00:52 IST|Sakshi

విజయవాడ సిటీ : శ్రీమంతుడు సినిమా విడుదలను పురస్కరించుకొని గవర్నరుపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సినిమా థియేటర్ల వద్ద టికెట్లను బ్లాకులో విక్రయిస్తున్న 13మందిని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నగదు, సినిమా టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. సినిమా టికెట్లను భారీగా బ్లాకులో విక్రయిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పలు థియేటర్ల వద్ద ఏసీపీ పి.మురళీధర్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా13 మంది పట్టుబడ్డారు. వారి వద్ద రూ.17,340 నగదు, 63 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం వారిని గవర్నరుపేట పోలీసులకు అప్పగిం చారు. ఎస్‌ఐ సురేష్‌రెడ్డి దాడుల్లో పాల్గొన్నారు.

 సత్యనారాయణపురంలో..
 సత్యనారాయణపురం : శ్రీమంతుడు సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న 11 మందిని సత్యనారాయణ పురం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద రూ.9వేలు స్వాధీనం చేసుకున్నారు. గాంధీనగర్ థియేటర్ల వద్ద వారిని పట్టుకున్నా మని సీఐ సత్యనారాయణ తెలిపారు.
 

మరిన్ని వార్తలు