బాల్య వివాహాలను అడ్డుకున్న అధికారులు

22 Jun, 2014 02:42 IST|Sakshi
  • తీవ్రంగా వ్యతిరేకించిన బంధువులు
  •  ఎంతో ఖర్చు చేశామంటూ నిరసన
  • గంపలగూడెం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నింధనలకు విరుద్ధంగా  జరుగుతున్న అయిదు బాల్య వివాహాలను శనివారం  అధికారులు  అడ్డుకున్నారు. గంపలగూడెం మండలంలోని అమ్మిరెడ్డిగూడెం పంచాయతీలో   ఒకే సామాజిక వర్గానికి చెందినవారి మూడు బ్యా వివాహాలను నిలిపివేశారు. చిన్నకొమెర, అమ్మిరెడ్డిగూడెం గ్రామాల్లోని  ముగ్గురు  బాలికలకు వివాహం జరిపేందుకు తల్లిదండ్రులు  అంతా సిద్ధం చేశారు.  

    ఇంకొద్ది సమయంలో వివాహాలు జరుగుతాయనగా... సమాచారమందుకున్న ఐసీడీఎస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఐకేపీ అధికారులు గ్రామానికి చేరుకొని ముగ్గురు బాలికల తల్లి ్లదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.  అమ్మిరెడ్డిగూడెంకు చెందిన బత్తుల కోటయ్య, కుమారి  కుమారుడు సుబ్బారావుకు అదే గ్రామానికి చెందిన  బాలిక(13)కు, గంపలగూడెంకు చెందిన తమ్మిశెట్టి వెంకటస్వామి, సీతమ్మ  కుమారుడు నాగరాజుకు చిన్నకొమిరకు చెందిన  బాలిక(12)కు, మైలవరం మండలం వెల్వడంకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు కుమారుడు వీరరాఘవులను చిన్నకొమిరకు చెందిన  బాలిక(14)కు ఇచ్చి వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు.

    ముగ్గురు పెండ్లి కుమారులను, కుమార్తెలను అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకొచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకుని తాళికట్టే సమయానికి అధికారులు వివాహాలను నిలిపివేయటంతో కుటుంబీకులు, బంధువులు, పలువురు గ్రామస్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాము ఎన్నో రోజుల క్రితం సంబంధాలు కుదుర్చుకుని, ఎంతో ఖర్చుచేసి  ఏర్పాట్లు చేసుకొంటుంటే ఏమీ మాట్లాడని అధికారులు, వివిధ శాఖల సిబ్బంది ఇప్పడు ముహూర్త సమయానికి వచ్చి నిబంధనల పేరిట అడ్డుకోవడం సహించబోమని ఎదురుతిరిగారు.

    అయితే ఆడపిల్లకు 18 సంవత్సరాలు, మగవారికి 21 సంవత్సరాలు నిండనిదే వివాహం జరిపితే చట్ట ప్రకారం నేరమని అధికారులు వారికి వివరించారు. దీనికి విరుద్ధంగా వ్యవ హరిస్తే అరెస్టు చేయాల్సి వస్తుందనిదిన హెచ్చరించారు. దీంతో సంబంధిత కుటుంబాలకు చెందిన వారు వివాహాలు జరపబోమని అధికారులకు హామీ ఇచ్చారు.  

    మేజర్లు అయ్యే వరకు వివాహం జరిపించమని లిఖితపూర్వకంగా హామీ పత్రం రాయించుకుని వారిని వదిలివేశారు. సీడీపీవో అంకమాంబ, తహశీల్దార్ రామచందర్, ఎంపీడీవో వీ లలితకుమారి, తాత్కాలిక  విధ్యాశాఖాధికారి వీ శేషిరెడ్డి, ఐకేపీ ఏపీఎం జమలయ్య, జండర్ ప్రతినిధి వెదురు లింగమ్మ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు నాగమణి, తారాభీ,ఝాన్సీ, ఆర్‌ఐ నాగమల్లేశ్వరరావు, వీఆర్‌వో రత్నబాబు, సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు.
     
    జగ్గయ్యపేటలో..

    జగ్గయ్యపేట అర్బన్: నందిగామకు చెందిన ఓ బాలిక వివాహం పేట పట్టణంలో బంధువుల ఇంట్లో జరుగుతుండగా స్థానిక ఐసీడీయస్ అధికారులు అడ్డుకున్నారు. చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామానికి చెందిన బాలికకు నందిగామ పట్టణానికి చెందిన ఆవుల నరసింహారావుతో వివాహం నిశ్చయమైంది. కాగా 6వవార్డు ఆర్టీసీ కాలనీలో ఆమె బంధువుల ఇంట్లో వివాహం జరుగుతుండగా  అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కార్యకర్తలు అక్కడకు చేరుకుని పోలీసుల సహాయంతో పెండ్లిని నిలుపుదల చేశారు.   

    నందిగామ అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు శ్రీదేవి, భారతి, పేట సూపర్‌వైజర్ వెంకట్రావమ్మ  మాట్లాడుతూ  బాలికలకు 18 సంవత్సరాలు నిండకుండా  వివాహం చేయడం చట్టరీత్యా నేరమని,  పెండ్లి కుమార్తె మైనరని, ఆమె ప్రస్తుతం చింతలపాడు జెడ్పీ హైస్కూల్‌లో 9వతరగతి చదువుతుందన్నారు. ఈ విషయమై ఇరువురి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. వైఎస్సార్ సీపీ నేత, వార్డు కౌన్సిలర్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) వార్డు పెద్దలు అధికారులతో చర్చించి వివాహాన్ని ఆపేందుకు ఒప్పించడంతో కథ సుఖాంతమైంది.    6వవార్డు అంగన్‌వాడీ కార్యకర్తలు కృష్ణవేణి, ఎస్ పద్మ, ఆర్ మేరి తదితరులు పాల్గొన్నారు.
     
    వేదాద్రి తండాలో...

    వేదాద్రి(జగ్గయ్యపేట) : వేదాద్రిలోని తండాలో శనివారం తలపెట్టిన బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ సిబ్బంది అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలిక(16)కు ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం చేసేం దుకు రెండు కుటుంబాల వారు నిశ్చయిం చారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ పెళ్లి జరగాల్సి ఉంది. బాల్య వివాహం జరుగుతోందంటూ చిల్లకల్లు ఐసీడీఎస్ ప్రా జెక్టు అధికారిణి ఉమాదేవికి సమాచారం అందింది. వివాహం నిలిపివేయవల సిం దిగా సూపర్‌వైజర్ రాజేశ్వరి, ఆ గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తలను ఆమె ఆదేశిం చా రు. ఈ మేరకు వారు హుటాహుటిన తం డాకు వెళ్లారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో వారు వివాహాన్ని నిలిపివేశారు. కాగా ఐసీడీఎస్ సిబ్బంది వెళ్లే సమయానికి   భోజనాలు, కళ్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
     

మరిన్ని వార్తలు