రక్తమిస్తే ప్రాణం పోసినట్టే!

21 Jun, 2015 02:55 IST|Sakshi
రక్తమిస్తే ప్రాణం పోసినట్టే!

కర్నూలు :  రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో రక్తం ఇచ్చి ఆదుకుంటే బాధితులకు ప్రాణం పోసినట్టేననే ఎస్పీ ఆకేరవికృష్ణ అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు రక్తం అందక మరణించేవారికి రక్తం ఇచ్చి ఆదుకోవాలని ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు, జిల్లా యువతకు ఎస్పీ పిలుపునిచ్చారు. కల్లూరు ఎస్టేట్ గోదావరి పాలిమర్స్ ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం భగత్‌సింగ్ వీర్‌దళ్ యూత్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ఎస్పీ ఆకే రవికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. శిబిరాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. స్నేహితుని వర్ధంతిని పురస్కరించుకుని భగత్‌సింగ్ వీర్‌దళ్ యూత్ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. యూత్‌లో సభ్యుడిగా ఉన్న రాజేష్ 2011 జూన్ 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్నేహితుని జ్ఞాపకార్థం యూత్ సభ్యు లు అప్పటి నుంచి ఏటా  రక్తదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ .. రాజేష్ తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటించాలని సూచించా రు. ప్రజాసంఘాలు, స్వచ్చంద సంస్థలు రక్తదాన శిబిరాల ను విరివి గా నిర్వహించాలన్నారు. మంచి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలని యువతకు పిలుపునిచ్చా రు. భగత్‌సింగ్ వీర్‌దళ్ యూత్ సభ్యు లు 65 మంది రక్తదానం చేసి ప్రభు త్వ ఆసుపత్రి రక్త నిధికి అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున, నాల్గవ పట్టణ సీఐ రంగనాయకులు, ఎస్‌ఐ లు గోపీనాథ్, నాగలక్ష్మయ్య, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్‌ఐ రంగయ్య, యూత్ సభ్యులు రాము, నవీన్, మాలిక్, ఖాదర్, రహీమ్, రామకృష్ణ, మస్తాన్,రాజు, పురుషోత్తం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు