కొందరివాడు బీఎన్‌.. అందరివాడు టీజేఆర్‌

10 Apr, 2019 10:33 IST|Sakshi
టీజేఆర్‌ సుధాకర్‌బాబు, బీఎన్‌.విజయ్‌కుమార్‌

నిత్యం ప్రజలకు  అందుబాటులో టీజేఆర్‌

బీఎన్‌కు వీస్తున్న ఎదురు గాలులు

వ్యతిరేకిస్తున్న సొంత వర్గం

సాక్షి, చీమకుర్తి (ప్రకాశం): సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ తరపున టీజేఆర్‌ సుధాకర్‌బాబు, టీడీపీ తరపున బీఎన్‌.విజయ్‌కుమార్‌ ప్రధానంగా పోటీపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి ఇరుపార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం అసెంబ్లీకి గత ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గణాంకాలను పరిశీలించినట్లయితే సంతనూతలపాడు నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్నట్లు విధితమవుతుంది. నామినేషన్‌లను వేసినప్పటి నుంచి నియోజకవర్గంలోని చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం అనంతరం వైఎస్సార్‌సీపీ వైపే గాలివాటం ఉన్నట్లు విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇరుపార్టీలు, అభ్యర్థుల బలాబలాలను అంచాని వేసినట్లయితే ఈవిధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల మీద అలుపెరుగని పోరాటం ..
కొత్తగా పోటీచేస్తుండటం వలన నియోజకవర్గంలో ఎలాంటి వ్యతిరేక ఓటు ప్రభావం లేకపోవడం కలిసొచ్చే అంశం.
9 సంవత్సరాల నుంచి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే జనాభిప్రాయం అభ్యర్థికి బలాన్నిస్తుంది.
జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో అన్ని రకాల ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఎలాంటి అసమ్మతి వర్గాలు లేకపోవడం శుభపరిణామం
టిక్కెట్టు ఖరారు కాకుముందే సమన్వయకర్తగా ఏడాదికి పైగా నియోజకవర్గంలో తిరుగుతూ గ్రామాల్లో పట్టు సాధించటం అనుకూలం.
సుధాకర్‌బాబు వాగ్దాటి కలిగిన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించటం.
నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న బూచేపల్లి కుటుంబం అండదండలు సుధాకర్‌బాబుకు పుష్కలంగా లభించటం మరో ప్రధాన బలంగా చెప్పవచ్చు
నాలుగు మండలాల కన్వీనర్‌లు, ప్రధాన నాయకులతో పాటు గ్రామస్థాయి నాయకులతో చొరవగా కలుపుగోలుగా కలిసిపోవడం మరింత బలం.
స్థానిక సమస్యలను ఎక్కువుగా ప్రజలలోకి తీసుకుపోయేందుకు తగిన సమయం లేకపోవడం ప్రతికూలతలుగా చెప్పుకోవచ్చు.

వ్యతిరేక వర్గంతో ఉక్కిరిబిక్కిరి..
నియోజకవర్గంలో పదేళ్ల నుంచి పనిచేస్తున్నందున దానికి సంబంధించిన అనుభవం ఉపయోగపడే అవకాశం ఉంది
ఎస్సీ, బీసీలను ఆకట్టుకున్నా ఓసీ సామాజికవర్గంలో వ్యతిరేకత ఉంది.
ఐదేళ్ల పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ప్రభావం అభ్యర్థిపై చూపడం ప్రతికూలాంశం.
ఆది నుంచి అసమ్మతి నాయకుల తారస్థాయి వ్యతిరేక ప్రచారం అభ్యర్థికి ఇబ్బందికరంగా మారటం.
కలిసిపోయినట్లు నటిస్తున్న అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉండి వ్యతిరేకంగా పనిచేసే ప్రమాదం.
పదేళ్ల క్రితం ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉపయోగపడినా ఐదేళ్ల క్రితం నుంచి ఇన్‌చార్జిగా పనిచేసినా అధికార పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఆందోళన కలిగించే అంశం.

మరిన్ని వార్తలు