5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం

22 Jun, 2015 12:29 IST|Sakshi
5040 ఎకరాల్లో భోగాపురం విమానాశ్రయం

విజయనగరం: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుపై గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని సోమవారం అధికారులతో  సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ..5040 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

 

భూసేకరణ, సమీకరణలో రైతులు దేనికి ముందుకు వస్తే ఆ విధానం లో భూమిని సేకరిస్తామని మృణాళిని తెలిపారు. భూమి కోల్పోయిన రైతులకు విమానాశ్రయం సమీపంలోనే ప్రభుత్వ భూములు ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. లేని పక్షంలో రాజధాని పరిహారం కంటే ఎక్కువ పరిహారం ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు. 9 పంచాయతీలు, 8 రెవెన్యూ గ్రామాలు విమానాశ్రయం పరిధిలోకి వస్తాయని చెప్పారు.

మరిన్ని వార్తలు