పిడుగుపాటుకు ముగ్గురి మృతి

4 Sep, 2015 03:59 IST|Sakshi
పిడుగుపాటుకు ముగ్గురి మృతి

శనగపాడు (పెనుగంచిప్రోలు) : మండలంలోని శనగపాడులో గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతిచెందారు. గ్రామానికి చెందిన కీసర రాజారత్నం (35), కీసర ఇసాక్ (28), మరో పది మంది వ్యవసాయ కూలీలు గ్రామ శివారులోని సుబాబుల్ కర్ర కొట్టేందుకు వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం పడటంతో ఇంటికి బయలుదేరారు. మార్గం లో పిడుగు పడటంతో రాజారత్నం, ఇసాక్ అక్కడికక్కడే మృతిచెందారు. ము నేరు మధ్య లంకల్లో గేదెలు మేపేందుకు వెళ్లిన కోనంగి శక్తేశ్వరరావు (22) కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అశోక్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో తొలుత నందిగామకు, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పిడుగుపాటుకు రోడ్డుపై  రంధ్రాలు పడ్డాయి.

 గ్రామంలో విషాదం...
 ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవటంతో రాజారత్నం, ఇసాక్ కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. రాజారత్నంకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇసాక్‌కు భార్య, ఐదేళ్లలోపు ముగ్గురు సంతానం ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందటంపై శక్తేశ్వరరావు కుటుం బ సభ్యులు శోకసముద్రంతో మునిగిపోయారు. సంఘటనా స్థలాన్ని తహశీల్దార్ కె.నాగేశ్వరరావు, ఎంపీడీవో వై.శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ కె.సతీష్ సందర్శించి వివరాలు సేకరించారు.

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామకు తరలించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సామినేని ఉదయభాను మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాగా ఈ ఘటనలో మృతులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.

మరిన్ని వార్తలు