మేడ్చల్ రూట్ బస్సులకు బాంబు బూచీ

13 Dec, 2013 00:37 IST|Sakshi

మేడ్చల్, న్యూస్‌లైన్: నగరం నుంచి మేడ్చల్‌కు రాకపోకలు సాగించే రూట్ నంబర్ 229 బస్సులో బాంబు ఉందని గుర్తుతెలియనివ్యక్తి ‘100’కు ఫోన్ చేయడంతో అధికారులు, పోలీసులు తనిఖీ లు చేపట్టారు. చివరకు ఆకతాయిల పనిగా భావించి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ రఘునాథసాయి కథనం ప్రకా రం వివరాలిలా ఉన్నాయి. నగరం నుంచి మేడ్చల్‌కు తిరుగుతున్న రూట్ నంబర్ 229లో ఓ బస్సులో బాంబు ఉందని, అది రాత్రి 8-10 గంటల మధ్యలో పేలుతుందని నగరంలోని కంట్రోల్ రూమ్‌కు బుధవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. 229 నంబర్ బస్సులు ఎక్కడ తిరుగుతాయో పోలీసులకు స్పష్టంగా తెలియకపోవడంతో నగరంలోని సుల్తాన్‌బజార్ ఠాణాకు సమాచారం ఇచ్చారు.
 
 సుల్తాన్‌బజార్ పోలీసులు రూట్ నంబర్ 229 బస్సు నగరం నుంచి మేడ్చల్‌కు రాకపోకలు సాగిస్తోందని గుర్తించి మేడ్చల్ డిపో మేనేజర్ రఘునాథసాయికి విష యం తెలిపారు. అప్రమత్తమైన డీఎం వెంటనే ఈ రహదారిలో ఉన్న మేడ్చల్, బోయిన్‌పల్లి, పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారమిచ్చి ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలిపారు. అనంతరం మేడ్చ ల్ రూట్ ప్రధాన పాయింట్ అయిన సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లారు. మేడ్చల్ రూట్‌లో తిరుగుతున్న నంబర్ 229 బస్సులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. పోలీసులు మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు తిరుగుతున్న సం బంధిత బస్సులను ఎక్కడికక్కడ నిలిపి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ డిపోలో పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది గాలించారు. రాత్రి 11:30 గం టల వరకు సోదాలు నిర్వహించిన పోలీ సులు ఆకతాయిల పనిగా అనుమానిం చారు. ఎక్కడా బాంబు ఆచూకీ లభించకపోవడంతో అధికారులు, పోలీసులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు