సీఐడీ చేతిలో 'బొమ్మరిల్లు'

25 Feb, 2014 12:03 IST|Sakshi
సీఐడీ చేతిలో 'బొమ్మరిల్లు'

కోట్లాది రూపాయిల డిపాజిట్లు ఖాతాదారులను నుంచి సేకరించి అనంతరం బోర్డు తిప్పేసిన 'బొమ్మరిల్లు' కేసును నేర పరిశోధన విభాగం (సీఐడీ)కి  ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ బి. ప్రసాదరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.  ఈ కేసును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆయన జారీ చేసిన ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

 

విశాఖపట్నం కేంద్రంగా బొమ్మరిల్లు సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఖాతాదారుల నుంచి దాదాపు రూ. 300 కోట్లు వసూల్ చేసింది. అనంతరం అ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఖాతాదారులు లబోదిబోమన్నారు. దీంతో ఖాతాదారులు అటు పోలీసులను, ఇటు ప్రభుత్వ పెద్దలను ఆశ్రయించారు. దాంతో పోలీసులు బొమ్మరిల్లు సంస్థపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసుల దర్యాప్తులో రాజకీయ నాయకులతోపాటు పలువురు ఉన్నతాధికారులు బొమ్మరిల్లు వెనుక ఉన్నట్లు తెలింది. దాంతో ప్రభుత్వం సీఐడీకి కేసు అప్పగించింది.

మరిన్ని వార్తలు