పాతబస్తీలో బోనాలు ప్రారంభం

4 Aug, 2013 08:22 IST|Sakshi
పాతబస్తీలో బోనాలు ప్రారంభం

పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు వేడుకలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరారు.
 
మరోవైపు ఆషాఢ బోనాలకు పాతబస్తీలోని ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, మీరాలంమండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్‌షాహీ శీతల్‌మాత మహంకాళి, గౌలిపురా నల్లపోచమ్మ, అక్కన్నమాదన్న మహంకాళి తదితర ఆలయాల్లో నేడు బోనాల వేడుకలు జరుగుతున్నాయి.
 
అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలూ కలుగకుండా సకల ఏర్పాట్లూ చేసినట్టు మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్‌తివారీ చెప్పారు. ఈ ఉత్సవాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ఉపముఖ్యమంత్రి రాజనర్సిం హతోపాటు తెలంగాణ ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారి ఆలయాలను సందర్శిస్తారన్నారు. మంత్రి గీతారెడ్డి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు.

కాగా, బోనాల ఉత్సవాల సందర్భంగా ఇప్పటి వరకు ఆలయాల వద్ద అధికారులు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని రాకేష్ తివారీ ఆరోపించారు.

మరిన్ని వార్తలు