బోసి నవ్వులు ఇక లేవు

17 Feb, 2014 02:08 IST|Sakshi
బోసి నవ్వులు ఇక లేవు

 బోసి నవ్వులు ఇక లేవు
 ఎం.అగ్రహారం(మద్దికెర),  : బుడి బుడి అడుగులకే ఆ చిన్నారి జీవిత ప్రయాణం ఆగిపోయింది.. బోసి నవ్వులతో ఇల్లంతా సందడి చేసిన పాపాయికి ఏడాదికే వందేళ్లూ నిండాయి.
 
 ఇంట్లోని ముసురునీళ్ల బకెట్టే ప్రాణాలు తీసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం మండల పరిధిలోని ఎం.అగ్రహారంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మన్యం రవి, మణి దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె వర్షిత(1). దీంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. చిన్నారి చిలిపి చేష్టలను చూసుకుంటూ సంబరపడేవారు. ఆదివారం ఇంట్లో వారంద రూ పొలం పనులకు వెళ్లారు. తల్లి మణి, కూతురు వర్షిత మాత్రమే ఇంట్లో ఉన్నారు. చిన్నారి ఆడుకుంటూ ఉండడంతో మణి బాత్‌రూమ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లోని ముసురునీళ్ల బకెట్‌లో తలపెట్టి చిన్నారి ఆడుకుంటూ అందులో పడిపోయింది. బాత్‌రూం నుంచి వచ్చిన తల్లి బకెట్‌లో తలవాల్చిన బిడ్డను చూసి గుండెలు బాధుకుంది.
 
 చిన్నారిని బయటకు తీసి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే స్థానిక వైద్యుడికి చూపించగా అప్పటికే వర్షిత ప్రాణాలు వదిలింది. ఆ సంఘటనతో తల్లి మణి సృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మద్దికెర వైద్యశాలకు తరలించారు. బాలిక మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
 

మరిన్ని వార్తలు