బీసీజీ నివేదిక : ఏపీకి రెండు ఆప్షన్లు

3 Jan, 2020 21:24 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణపై బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) రెండు ఆప్షన్లు సూచించిందని ఆంధ్రప్రదేశ్‌ ప్రణాళికా కార్యదర్శి విజయ్‌కుమార్‌ అన్నారు. అసలు సచివాలయానికి ఎవరెవరు.. ఏయే పనులపై వస్తారు? ఎంత మంది వస్తారన్న దానిపై బీసీజీ ఆసక్తికర విశ్లేషణ చేసిందని తెలిపారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో శుక్రవాయం ఆయన మాట్లాడుతూ.. ‘ఏడాది మొత్తం లక్షమంది సచివాలయానికి వస్తే అందులో అధిక శాతం కేవలం ముఖ్యమంత్రి సహాయనిధికోసమే గతంలో వచ్చారని బీసీజీ తెలిపింది.
(చదవండి : సీఎం జగన్‌తో ముగిసిన బీసీజీ ప్రతినిధుల భేటీ)

ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద సేవలు అందిస్తున్నా ఆ సమాచారం తెలియక చాలామంది సచివాలయానికి వస్తున్నారని బీసీజీ పేర్కొంది. కాంట్రాక్టర్లు, బదిలీలు కోరుకునేవారు, ప్రభుత్వంలో ఉన్న పెండింగు బిల్లులకోసం వచ్చేవారు అత్యధికమని బీసీజీ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాంతీయంగా ఈ పనులను జరిగేలా చూసుకుంటే సరిపోతుందని బీసీజీ వివరించింది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలన్నీ మొదటి ప్రాధాన్యతా నగరమైన విశాఖలో ఉండేట్టుగా చూసుకోవడం హేతుబద్ధమైందని బీసీజీ అభిప్రాయపడింది. లేకపోతే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేట్టుగా చూసుకోవాలని బీసీజీ తెలిపింది. వీటితో పాటు బీసీజీ రెండు ఆప్షన్లను సిఫార్సులు చేసింది.
 
ఆప్షన్‌ 1 : 
విశాఖపట్నంలో  గవర్నర్, సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇండస్ట్రీ–ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ శాఖలు, టూరిజం శాఖ, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతిలో అసెంబ్లీ, ఎడ్యుకేషన్‌కు సంబంధించి మూడు హెచ్‌ఓడీ కార్యాలయాలు, అగ్రికల్చర్‌కు సంబంధించి నాలుగు హెచ్‌ఓడీ కార్యాలయాలు, సంక్షేమ–స్థానిక సంస్థలకు సంబంధించి 8 హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో  హైకోర్టు, స్టేట్‌ కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు


ఆప్షన్‌ 2: 
విశాఖపట్నంలో  సచివాలయం, గవర్నర్‌ – సీఎం ఎస్టాబ్లిష్‌మెంట్లు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన హెచ్‌ఓడీ కార్యాలయాలు, అత్యవసర సమావేశాలకోసం అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు బెంచ్‌

కర్నూలులో  హైకోర్టు, స్టేట్‌కమిషన్లు, అప్పిలేట్‌ సంస్థలు

మరిన్ని వార్తలు