అలా చూపిస్తే.. సభలో తలదించుకుంటా: బొత్స

17 Jun, 2019 15:09 IST|Sakshi

హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదు

సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడినట్లు చంద్రబాబు ఏనాడైనా మాట్లాడారా

మండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు అవంతి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినట్లు చంద్రబాబు నాయుడు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.  హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే.. సభలో తలవంచుకుని నిలబడతానంటూ మంత్రి బొత్స  సత్యనారాయణ సవాల్‌ చేశారు.

హోదా వద్దని ప్యాకేజీని ఎందుకు తీసుకువచ్చారని మంత్రి ఘాటుగా ప్రశ్నించారు. హోదా సంజీవని కాదంటూ చంద్రబాబు అవహేళన చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. హోదా గురించి మాట్లాడే హక్కు టీడీపీ సభ్యులకు లేదని తీవ్రంగా హెచ్చరించారు. కేంద్రంతో కొట్లాడైనా సరే ఏపీకి ప్రత్యేక హోదాను తెచ్చి తీరుతామని మంత్రి బొత్స మండలిలో స్పష్టం చేశారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

ప్రాణం తీసిన బిందె

హెచ్‌ఐవీ ఉందని ఇంటికి పంపించేశారు

బీసీలను గుర్తించింది ఒక్క జగనే!

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

మహానేత స్ఫూర్తితో శ్రేయోదాయక బడ్జెట్‌

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

వైఎస్‌కు ఇచ్చిన వాగ్దానం మేరకే అనంతకు కియా

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

స్కెచ్చేశాడు.. చంపించాడు

రూ. కోటిన్నర లాభం కోసం.. రూ.53 కోట్లు పెట్టుబడి!

ప్రజాధనం ఆదా

‘క్రయోజనిక్‌’లో లీకేజీ వల్లే..

టీటీడీలో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన వైవీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఒకటి అడిగితే సీఎం జగన్‌ రెండు చేస్తున్నారు..

రాష్ట్రంలో మూడు కొత్త స్టేడియాలు : అవంతి

సీఎం జగన్‌ను కలిసిన ‘నాటా’ బృందం

‘అందుకే విద్యుత్‌ ఒప్పందాలపై పునఃసమీక్ష’

తిరుమలలో యువతిపై ఎలుగుబంటి దాడి

శ్రీపూర్ణిమ‌ గ్రంథాన్ని ఆవిష్కరించనున్న వైఎస్‌ జగ‌న్

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

‘వారికి పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్రానిదే’

విద్యుత్‌ ఉద్యోగుల పంపకాలపై సుప్రీంలో విచారణ

ఏపీలో మావోయిస్టుల సమస్యలపై సబ్‌ కమిటీ

ట్రిపుల్‌ మర్డర్: రక్తంతో శివుడికి అభిషేకం

కర్నూలు జిల్లాలో పెద్దపులి అలజడి

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

ఆర్‌ అండ్‌ ఆర్‌లో భారీ అక్రమాలు: జీవీఎల్‌

దాతల విస్మరణ.. మాజీల భజన..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం