కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!

16 Sep, 2019 16:08 IST|Sakshi

కోడెల మరణంపై అనుమానాలు ఉన్నాయి

సాక్ష్యాలు తారుమారు కాకుండా విచారణ జరపాలి

కోడెల మరణాన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది

మాజీ స్పీకర్‌ మృతిపై విచారం వ్యక్తం చేసిన మంత్రి బొత్స

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మరణంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కోడెల మరణం బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. కోడెల మరణంపై క్షణక్షణం అనేక వార్తలు మారుతూ వస్తున్నాయని, ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని సందేహం వ్యక్తం చేశారు. ఈ టీవీ న్యూస్‌ ఛానల్‌లో గుండెపోటు అని వార్తలు వచ్చాయని, తరువాత అదే టీవీలో ప్రమాదకర ఇంజెక్షన్ అని వార్తలు వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు టీడీపీకి సంబందించిన ఛానల్స్‌లో మాత్రం గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయని తెలిపారు. కోడెల మరణంపై సాక్ష్యాలు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన కోరారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కోడెల మరణంపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ‘గుండెపోటు మృతి చెందితే.. అపోలో లేదా కేర్ హాస్పిటల్‌కు తీసుకువెళ్తారు.. కానీ బసవతారకం కాన్సర్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకెళ్లారు? కోడెల మరణంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులు ప్రభుత్వ ఒత్తిడి వల్లే ఉరి వేసుకున్నారు అని అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయ చేస్తున్నారు. విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి. ఉరి వేసుకున్నారా?.. కటుంబ కలహాల వలన జరిగిందా? అనే విషయాలపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నాము. ప్రభుత్వం కోడెల మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. స్థానికంగా ఉన్న ప్రజలు, నేతలు కేసులు పెట్టారు. ఆయన వలన ఇబ్బంది పడిన వారే కేసులు పెట్టారు. మాకు శవ రాజకీయాలు చేయడం తెలియదు. టీడీపీ నేతలు కోడెల మరణాన్ని రాజకీయం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

చదవండి:

కోడెల మృతిపై కేసు నమోదు

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?

సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం!

కోడెల శివప్రసాదరావు కన్నుమూత

మరిన్ని వార్తలు