గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం..

11 May, 2020 15:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనపై ప్రజలను భయాందోళనలకు గురిచేసేలా వార్తలు రాయొద్దని మంత్రి బొత్స సత్యనారాయణ  కోరారు. లోకో పైలట్లు విష వాయువు బారిన పడ్డారన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో అసత్య కథనాలను ప్రచారం చేయడం మంచిది కాదని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
(స్టైరిన్‌ తరలింపు ప్రక్రియ ప్రారంభం)

ఆహారం అందిస్తాం: అవంతి శ్రీనివాస్‌
ఉదయం నుంచి గ్రామాల్లో అంత క్లీనింగ్‌ చేయిస్తున్నామని.. జీవీఎంసీ అధికారులు ఇచ్చిన సూచనలు మేరకు ఇళ్లలోకి వెళ్లాలని ప్రజలకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. ఇళ్లలో ఏసీలు ఆన్‌ చేయొద్దన్నారు. గ్రామాల్లోకి వచ్చేవారికి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇళ్లలో ఎవరూ ఆహారం వండుకోవద్దని తెలిపారు. వార్డు వలంటీర్లు, అధికారులు గ్రామాలను పర్యవేక్షణ చేసి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
(గ్యాస్‌ లీక్‌ : సీఎం జగన్‌ సహాయం ఓ నిదర్శనం)

మరిన్ని వార్తలు