మీరే నన్ను ప్రోత్సహించాలన్నా..

17 Sep, 2018 06:44 IST|Sakshi

విశాఖపట్నం :అన్నా..మాది శ్రీరాంపురం. పాయకరావుపేట మండలం. సెకెండ్‌ ఇంటర్‌ చదువుతున్నా. చిన్నప్పటి నుంచి బాక్సింగ్‌ అంటే ఇష్టం. బాక్సింగ్‌లో  అంతర్జాతీయ స్థాయిలో (ఉక్రెయిన్‌) జరిగిన పోటీలలో బ్రాంజ్‌ మెడల్, నేషనల్‌ స్థాయిలో వివిధ పోటీలలో రెండు గోల్డ్, ఒక సిల్వర్, ఒక బ్రాంజ్‌. రాష్ట్రస్థాయిలో పలు అవార్డులు సాధించా. మాది నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నా. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లభించడం లేదు. 2024లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనేలా నాకు సహయం చేయాలన్నా..      – బగ్గు మౌనిక, బాక్సర్‌

మరిన్ని వార్తలు