ఫోన్లో పరిచయం..ఆపై ప్రేమాయణం

16 Jul, 2014 14:46 IST|Sakshi
ఫోన్లో పరిచయం..ఆపై ప్రేమాయణం

విజయవాడ : ప్రేమించానన్నాడు...పెళ్లి చేసుకుని జీవనం సాగిద్దామని నమ్మించాడు. చివరకు ఆమె నగలు తీసుకుని మాయమయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విజయవాడ పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ప్రసాదంపాడుకు చెందిన మల్లీశ్వరి (19) పదో తరగతి వరకూ చదువుకుంది. తండ్రి లేకపోవటంతో సోదరుడి వద్ద ఉంటోంది. ఖాళీగా ఉండటంతో ఇతరులకు ఫోన్ చేసి మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నివాసం ఉంటున్న అసమాన్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.

వీరిద్దరూ కలిసి విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విహార యాత్రలు చేశారు. చివరకు తమ ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించరని ...ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో తన వద్ద ఉన్న సుమారు 50 కాసుల బంగారు ఆభరణాలను మల్లీశ్వరి ఈనెల 10వ  అసమాన్ రెడ్డికి అందించింది. వాటిని తీసుకున్న అతగాడు వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే లిప్ట్ చేయకపోవటంతో తాను మోసపోయనని గ్రహించిన బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు