బీపీఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

8 Mar, 2014 03:04 IST|Sakshi

ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచ్ పోస్టుమాస్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు పోస్టల్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ ఒ.విజయకుమార్ నోటిఫికేషన్ వివరాలు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో మొత్తం 8 బ్రాంచ్ పోస్టుమాస్టర్ ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు విధివిధానాలు ప్రకటించారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

వచ్చిన దరఖాస్తులు పరిశీలించి సక్రమంగా ఉన్నవాటిని గమనించి అభ్యర్థులకు ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు ఒంగోలులోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు లేదా స్పీడ్‌పోస్టు ద్వారా మాత్రమే చేయాలి. దరఖాస్తులను ఒ.విజయకుమార్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, ప్రకాశం డివిజన్, ఒంగోలు-523001కు పంపాలన్నారు. దరఖాస్తులు పంపే కవర్‌పై అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ జీడీఎస్ బీపీఎం, బీవో, ఏడబ్ల్యూ, ఎస్‌వో అని రాయాలి.
  జిల్లాలో బ్రాంచ్ పోస్టుమాస్టర్ల ఖాళీలు కింది విధంగా ఉన్నాయి.  

  సింగరాయకొండ సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని పాకల బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్  4వ తేదీ ఉదయం 10 గంటలకు జరుగుతుంది.
 తాళ్లూరు సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని శివరామపురం బీపీఎం ఓబీసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు.
 అద్దంకి సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని సంకువారిపాలెం బీపీఎం ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 9న ఉదయం 10 గంటలకు.
 దర్శి సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని నిమ్మారెడ్డిపాలెం బీపీఎం ఓబీసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 9న మధ్యాహ్నం 2 గంటలకు.

 వలపర్ల సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని చిమ్మిరిబండ బీపీఎం ఓసీలకు  కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 11వ తేది ఉదయం 10 గంటలకు.
 మొగ ళ్లూరు సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని నాగిరెడ్డిపల్లి బీపీఎం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ నెల 11 మధ్యాహ్నం 2 గంటలకు.

 మార్టూరు సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని బొబ్బేపల్లి బీపీఎం  ఓసీలకు కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 15న ఉదయం 10 గంటలకు.
 దర్శి సబ్‌పోస్టాఫీస్ పరిధిలోని దేవవరం బీపీఎం ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. ఇంటర్వ్యూ ఏప్రిల్ 15 మధ్యాహ్నం 2 గంటలకు.

మరిన్ని వార్తలు