బ్ర‌హ్మంగారి మ‌ఠంలో ఆరాధ‌న ఉత్స‌వాల ర‌ద్దు

29 Apr, 2020 09:58 IST|Sakshi

సాక్షి, బ్రహ్మంగారిమఠం (కడప): ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న‌ క‌రోనా వైర‌స్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని బ్ర‌హ్మంగారి మ‌ఠంలో నేటి నుంచి జ‌ర‌గాల్సిన ఆరాధ‌న ఉత్స‌వాలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఆల‌యాధికారులు ప్ర‌క‌టించారు. సాధార‌ణంగా అయితే  బ్రహ్మంగారిమఠం మండలంలో ఏప్రిల్ 29 నుంచి మే 4 వ‌ర‌కు ఉత్స‌వాలు నిర్ణ‌యించారు. ఇందులో మే 2న బ్ర‌హ్మంగారు స‌జీవ స‌మాధి నిష్ట వ‌హించిన రోజు కాగా 3న ర‌థోత్స‌వం నిర్వ‌హించాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఏర్ప‌డ్డ విష‌మ ప‌రిస్థితుల దృష్ట్యా వీటిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు నిర్ణ‌యం తీసుకున్నారు. కావున‌, భ‌క్తులెవ‌రూ ఉత్స‌వాల‌కు రావ‌ద్ద‌ని మ‌ఠం పీఠాధిప‌తి శ్రీ వసంతి వెంక‌టేశ్వ‌ర‌స్వామి, ఆల‌య మేనేజ‌ర్ ఈశ్వ‌రాచారి కోరారు. (కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు రోబోతో సేవలు)

మరిన్ని వార్తలు