విద్యార్థులకు బీఆర్‌ఏయూ షాక్

29 Mar, 2014 02:31 IST|Sakshi

పొందూరు, న్యూస్‌లైన్: ప్రశ్న పత్రాల లీకులతో విమర్శలు ఎదుర్కొంటున్న డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు డిగ్రీ విద్యార్థులకు షాక్ ఇచ్చారు. ప్రశ్న పత్రంలో ఓ ప్రశ్న ముద్రించకపోవడంతో విద్యార్థు లు దానికి మార్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.
 
వివరాలు ఇవీ... శుక్రవారం డిగ్రీ  రెండో సంవత్సరం(బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీ ఎం) విద్యార్థులకు జనరల్ తెలుగు పేపర్ పరీక్ష జరిగింది. ప్రశ్న పత్రం చూసి అవాక్కవడం విద్యార్థుల వంతైంది. కారణమేమిటంటే... ప్రశ్న పత్రం రెండవ పుటలో ఐదవ ప్రశ్నలో నాలుగు ప్రశ్నలిచ్చి ఒకదానికి వ్యాసం(జవా బు) రాయవలసి ఉంది. అయితే ఇందులో మూడు ప్రశ్నలే ఇచ్చారు. రోమన్ నంబర్ 1, 3, 4ల్లో ప్రశ్నలు మాత్రమే  ఇచ్చారు. రెండో ప్రశ్న స్థానంలో కేవలం అంకె వేసి వదిలేశారు.
 
ఈ ప్రశ్నకు ఎనిమిది మార్కులు కేటాయించా రు. దీంతో తాము చేయని తప్పునకు అనవసరంగా ఎనిమిది మార్కులు కోల్పోవలసి వచ్చిందని పలువురు విద్యార్థులు ‘న్యూసలైన్’కు తెలిపారు. తమకు జరిపిన అన్యాయాన్ని యూనివర్సిటీ ఉపకులపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.  ఈ ప్రశ్నపత్రం కోడ్ నంబర్ ట్చట002. ఈప్రశ్నపత్రం మొత్తం 70 మార్కులకు కేటాయించారు.

మరిన్ని వార్తలు