శ్రీసిటీలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు

23 Oct, 2019 06:31 IST|Sakshi
బ్రిటీష్‌ డిప్యూటీ హై కమిషనర్‌కు జ్ఞాపికను అందజేస్తున్న శ్రీసిటీ ఎండీ

పెట్టుబడులకు ఎంతో అనుకూలం

కితాబిచ్చిన బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెవిుంగ్‌

సాక్షి, తడ: శ్రీసిటీ పారిశ్రామికవాడలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పెట్టుబడులకు ఎంతో ఈ ప్రాంతం అనుకూలమని, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెవిుంగ్‌ కితాబిచ్చారు. మంగళవారం శ్రీసిటీ పర్యటనకు వచ్చిన ఆయనకు శ్రీసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ మౌలిక సదుపాయాలు, ప్రత్యేకతలు, అభివృద్ధిని వివరించారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన రోటోలోక్, ఎంఎండీతో సహా 7 సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తి కేంద్రాలను శ్రీసిటీలో ఏర్పాటు చేశాయని వివరించారు. అనంతరం డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెవిుంగ్‌ మాట్లాడుతూ.. శ్రీసిటీ యాజమాన్యం ధార్శినికత, అభివృద్ధి తమకెంతో నచ్చాయన్నారు. శ్రీసిటీలో 7 బ్రిటిష్‌ పరిశ్రమలు ఏర్పాటుకావడం సంతోషదాయకమన్నారు.

యూకే ప్రభుత్వ అంతర్జాతీయ వాణిజ్యాన్ని విస్తృతపరిచే దిశగా శ్రీసిటీ పర్యటనకు వచ్చామన్నారు. త్వరలో మరిన్ని బ్రిటిష్‌ కంపెనీలు శ్రీసిటీకి రానున్నాయని ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో  పెట్టుబడులకు అత్యంత అనుకూల ప్రాంతంషగా భారతదేశం అవతరించిందన్నారు. మన దేశంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్న ఐరోపా దేశాలలో యూకే అగ్రస్థానంలో ఉందన్నారు.అనంతరం శ్రీసిటీ వ్యాపార వాణిజ్య కేంద్రంలో ఇరువురి మధ్య పరస్పర చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో శ్రీసిటీ గురించి వివిధ అంశాలపై డాక్టర్‌ ఫ్లెవిుంగ్‌ ఆరా తీశారు. వీరి వెంట ట్రేడ్‌ అండ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ హెడ్‌ వరుణ్‌ మాలీ, దక్షిణ భారతదేశం ఇన్‌వర్డ్‌ ఇన్‌వెస్ట్‌మెంట్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ విశ్వనాథన్, లైఫ్‌ సైన్సెస్‌ హెల్త్‌ కేర్‌ సీనియర్‌ ట్రేడ్‌ అడ్వైజర్‌ హర్‌‡్ష ఇంద్రారుణ్, పొలిటికల్‌ ఎకానమి అడ్వైజర్‌ నళిని రఘురామన్, ప్రెస్, కమ్యూనికేషన్స్‌ హెడ్‌ పద్మజా కొనిశెట్టి, హెచ్‌ఆర్‌ ఆఫీసర్‌ నిధి శ్రీవాస్తవ ఉన్నారు. 

మరిన్ని వార్తలు