రాజంపేటలో బ్రౌన్‌షుగర్‌ అమ‍్మకాలు...

17 Dec, 2017 13:50 IST|Sakshi

-పోలీసులు అదుపులో అనుమానితులు-కిలో బ్రౌన్‌షుగర్‌ స్వాధీనం?

సాక్షి, రాజంపేట : వైఎస్సార్‌ జిల్లా రాజంపేట పట‍్టణం బ్రౌన్‌షుగర్‌ క్రయవిక్రయాలకు అడ్డాగా మారింది. నిషేధిత బ్రౌన్‌షుగర్‌ అమ‍్ముతున్నారన‍్న సమాచారంపై పట్టణానికి చెందిన కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. శనివారం రాత్రి కొంతమంది యువకులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారన‍్న వార‍్తలు గుప్పుమన్నాయి. వారి వద్ద నుంచి బ్రౌన్‌షుగర్‌ కూడా లభ్యమైనట్లు తెలిసింది. కాగా ముగ్గురిని ముందుగా అదుపులోకి తీసుకొని విచారించినట్లు, ఆపై మరికొంతమందిని కూడా పోలీసులు విచారణ చేసినట్లుగా సమాచారం. అయితే పోలీసులు అదుపులో ఉన్న యువకులు పట్టణానికి చెందిన వారు కావడంతో పోలీసుస్టేషన్‌ వద్ద సంబంధీకులు మకాం వేశారు. దీన్ని బట్టి చూస్తే రాజంపేట పట్టణంలో బ్రౌన్‌షుగర్‌ అమ్మకాలు జరుగుతున్నాయనే వాదన బలపడుతోంది. స్థానికంగా గల్ఫ్‌ దేశాలకు వెళ్లేవారు ఎక్కువ కావటంతో ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను ఇక్కడికి తెప్పించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా డ్రగ్స్‌ వ్యాపారం సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో నిఘాను పెంచారు. శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర‍్భంగా కిలో బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు