బుడ్డలమిల్లులో అగ్నిప్రమాదం

14 Mar, 2016 04:30 IST|Sakshi
బుడ్డలమిల్లులో అగ్నిప్రమాదం

 కోడుమూరు ఘటన  రూ. 6లక్షల వరకు నష్టం

కోడుమూరు రూరల్ :  స్థానిక వెల్దుర్తి రోడ్డులోని రోహిత్ డిగాడిగేటర్ బుడ్డలమిల్లులో ఆదివారం విద్యుదాఘాతం కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కున్నూరు నాగేశ్వరరెడ్డికి చెందిన మిల్లు నుంచి పక్కనే ఉన్న మార్కెట్‌యార్డులో గోడౌన్ నిర్మాణానికి వెల్డింగ్ పనుల నిమిత్తం కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఆదివారం ఉదయం మార్కెట్‌యార్డులో కార్మికులు వెల్డింగ్ పనులు చేస్తుండగా మిల్లులో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. దీంతో మంటలు రేగి ఖాళీ సంచులతో పాటు బుడ్డల (వేరుసెనగ) సంచులకు అంటుకున్నాయి.

ప్రమాద సమయంలో మిల్లు మూసి ఉంది. పెద్ద ఎత్తున పొగలు బయటకు వస్తుండడంతో రోడ్డుపై వెళుతున్న వారు గమనించి యజమానికి, పక్కనే ఉన్న అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ మేరకు అగ్నిమాపక దళ సిబ్బంది మిల్లు వద్దకు చేరుకొని షెడ్డుకున్న రేకులను తొలగించి మంటలను అదుపులోకి తెచ్చారు. సరుకుకు తప్ప మిషనరీకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అగ్ని ప్రమాదంలో 100క్వింటాళ్లకుపైగా వేరుసెనగకాయలు, విత్తనాలు ఖాళీపోయాని, రూ.6లక్షలకు పైగా నష్టం వాటిళ్లిందని బాధిత మిల్లు యజమాని నాగేశ్వరెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు