చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ బస్సు

12 May, 2015 08:29 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన కోసం బుల్లెట్ ప్రూఫ్ బస్సును కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. సదరు బస్సును రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)తో కొనుగోలు చేయాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఆ బస్సుకు అయ్యే ఖర్చు ఆర్టీసీనే భరించాలని ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రూ. 5 కోట్ల ఖర్చుతో ఈ బస్సును  తయారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తొలి విడతగా రూ. 1.26 కోట్లను ఆర్టీసీ చెల్లించనుంది. అలాగే మరో రెండు వాయిదాల కింద రూ. 2.50 కోట్లు విడుదల చేయాలని ఆర్టీసీ ఎండీకి జారీ చేసిన ఆదేశాలలో ప్రభుత్వం పేర్కొంది.

మరిన్ని వార్తలు