‘స్వగృహ’కు బంపర్ ఆఫర్

29 Jan, 2014 02:36 IST|Sakshi

వన్‌టైం సెటిల్‌మెంట్‌కు బ్యాంకుల అంగీకారం
 సాక్షి, హైదరాబాద్: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు బ్యాంకులు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. వన్‌టైం సెటిల్‌మెంట్ కింద సెప్టెంబర్ నాటికి ఏకమొత్తంగా వెయ్యి కోట్ల రూపాయలు చెల్లిస్తే చాలని అంగీకరించాయి. అప్పుపై చెల్లించే వడ్డీని ఆరు శాతానికి తగ్గించేందుకు కూడా సరేనన్నాయి. బ్యాంకర్లతో మంగళవారం స్వగృహ కార్పొరేషన్ ఎండీ శ్రీధర్ జరిపిన భేటీలో ఈ ఒప్పందం కుదిరింది. వివరాలిలా ఉన్నాయి...


  స్వగృహ కార్పొరేషన్ గతంలో ఐదు బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,050 కోట్ల వరకు అప్పు తీసుకుంది.   ఒక్కసారి రూ.350 కోట్ల వడ్డీని మాత్రం చెల్లించింది. ఆ తర్వాత చెల్లింపులు జరిపేందుకు నిధులు లేకపోవటంతో వడ్డీ పేరుకుపోవటం మొదలైంది. ప్రస్తుతం ఏడాదికి రూ.60 కోట్లకుపైగా వడ్డీ పడుతోంది.  దీంతో గతంలో తాము చెల్లించిన రూ.350 కోట్లను అసలుగా భావించటంతోపాటు, ఇక వడ్డీ విధించకుండా ఉంటే... అప్పు మొత్తాన్ని ఏక కాలంలో చెల్లిస్తామంటూ గతంలో ప్రభుత్వం బ్యాంకులకు ప్రతిపాదించింది. కానీ ఇది అసాధారణంగా ఉందంటూ బ్యాంకులు తిరస్కరించాయి.  ఇప్పుడు వడ్డీ-అసలు అని కాకుండా అన్నీ కలిపి రూ.వేయికోట్లుగా నిర్ధారించి... చెల్లింపు జరిపే వరకు వడ్డీని, ఇప్పటివరకు ఉన్నట్టుగా 11 శాతం కాకుండా  6 శాతంగా మాత్రమే పరిగణిస్తామని బ్యాంకులు చెప్పాయి.

మరిన్ని వార్తలు