పూజ పేరిట వచ్చి.. వ్యాపారికి శఠగోపం!

29 Jan, 2017 12:38 IST|Sakshi

మంగళగిరి (గుంటూరు): దైవపూజ నిర్వహించేందుకు వచ్చిన ఓ పూజారి.. భక్తుడి నెత్తిమీద శఠగోపం పెట్టారు. వ్యాపారి కళ్లుగప్పి రూ. 50వేల విలువైన బంగారాన్ని మాయం చేశాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగింది. మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఓ పూజారిని పిలిపించారు.

అయితే, పూజలో కొంత బంగారాన్ని ఉంచాల్సిందిగా పూజారి  శ్రీనివాసరావుకు  చెప్పారు. ఆయన రూ. 50 వేల విలువైన బంగారాన్ని పూజలో పెట్టారు. కాసేపు పూజ చేస్తున్నట్టు అభినయించిన సదరు వ్యక్తి.. వ్యాపారి కళ్లు గప్పి బంగారంతో సహా ఉడాయించాడు. కాసేపటి తర్వాత తేరుకున్న వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు