సీఎం మీటింగ్‌కి సిట్టింగ్‌ ఎంపీ డుమ్మా

2 Mar, 2019 19:45 IST|Sakshi

కోడుమూరు సభకు బుట్టా రేణుకా గైర్హాజరు

సాక్షి, కర్నూలు: గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి కర్నూలు ఎంపీగా గెలుపొంది, ఆ తరువాత టీడీపీ గూటికి చేరిన బుట్టా రేణుక పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టికెట్‌ హామీతో టీడీపీలో చేరిన బుట్టాకు తాజాగా కేంద్ర మాజీమంత్రి కోట్లా సూర్యప్రకాశ్‌ రెడ్డి చేరికతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీట్ల పంపిణీలో తనకు తగుస్థానం కల్పించడంలేదంటూ గతకొంత కాలంగా ఆమె పార్టీ కార్యాకలపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. (నా పరిస్థితేంటి?!)

ఈ నేపథ్యంలో శనివారం కర్నూలు జిల్లాలోని కోడుమూరులో జరిగిన సీఎం చంద్రబాబు సభకు బుట్టా డుమ్మా కొట్టారు. దీంతో బుట్టా రేణుకా పార్టీ మారుతారనే ఊహాగానాలు జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఆమె కర్నూలు లోక్‌సభ స్థానుంచి తిరిగి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ సూర్య ప్రకాష్‌ ఎంట్రీతో రేణుకను పక్కనబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ టికెట్‌ ఇవ్వకపోతే పరిస్థితి ఎంటా అని ఆమె సతమవుతున్నారు. మరోవైపు కర్నూలులో కేయి, కోట్ల వర్గీయుల విభేదాలు భయపడపడుతున్న విషయం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు