‘మీరు తిన్న ప్రతి రూపాయి జగన్‌ కక్కిస్తారు’

12 Jun, 2019 13:05 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్ : గత 5 ఏళ్ల చంద్రబాబు పాలన మొత్తం అవినీతి మయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ. రామచంద్రయ్య మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని చంద్రబాబు గాడి తప్పించారని ధ్వజమెత్తారు. రామచంద్రయ్య మాట్లాడుతూ.. 'అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని గాడిలో పెడుతున్నారు. చంద్రబాబు తన కళ్ల ముందు వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి అవ్వడంతో అవమానం భరించలేకపోతున్నారు. వైఎస్ జగన్ స్పష్టమైన పరిపాలన అందిస్తారు. రాష్ట్రంలో ఎటువంటి అరాచకాలకు తావివ్వకుండా చూడాలని హోంమంత్రి సుచరితను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని జగన్ నేరవేరుస్తారు. చంద్రబాబు తన కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను మరిచారు. వైఎస్‌ జగన్ అలా కాకుండా అన్ని కులాల వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చి సమతుల్యం పాటించారు. జగన్‌కు అనుభవం లేదని అవహేళన చేశారు. ఈరోజు జగన్ పాలన చూసి టీడీపీ నాయకులకు వణుకు మొదలైంది. ఆశా వర్కర్లకు, అంగన్‌వాడీ వర్కర్లకు, హోంగార్డులకు వేతనాలు పెంచి వారి జీవితాల్లో సంతోషాలు తెచ్చారు. జగన్ ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు ప్రశంసించాల్సింది పోయి కామెంట్స్ చేయడం సిగ్గుచేటు. మీరు తిన్న ప్రతి రూపాయి విచారణలో జగన్ కక్కిస్తారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి, ప్రజల ఓట్లు తొలగించావు. డేటాను చోరీ చేశావు. ఆంధ్ర ప్రజలు మంచి వారు కాబట్టి చంద్రబాబు చేసిన అరాచకాలకు ఇంకా ఘోరంగా అవమాన పరచలేదు. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తప్పకుండా విచారణ చేయిస్తారు. 2 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి కూడా రైతులకు ఎటువంటి మేలు చేయలేదు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన జిమ్మికులను ప్రజలు గుర్తించారు' అని రామచంద్రయ్య అన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మిస్టరీగానే తెలుగు కుటుంబ మరణాలు

ఆరోగ్యశ్రీ వర్తించదని పిండేశారు!

ప్రతిపక్షంగా మంచి సూచనలు చేయండి

ఏపీ ఎంపీల ప్రమాణ స్వీకారం

అభివృద్ధి, సంక్షేమాలే గెలిపించవు 

ఆ తనిఖీతో మాకేంటి సంబంధం?

ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారు

ఆ ఐదు కాలేజీల వైపే విద్యార్థుల మొగ్గు..!

ఐదేళ్లలో మీరు చేసిందేమిటి?

20న పోలవరానికి సీఎం జగన్‌

పొగాకు రైతును ఆదుకోవాల్సిందే

రైతన్నకు కొత్త ‘శక్తి’

శారదా పీఠం ఉత్తరాధికారిగా స్వాత్మానందేంద్ర 

గోదావరి జలాలతో తెలుగు నేల తడవాలి

‘బెల్ట్‌’ తీయాల్సిందే

ఒక్క క్లిక్‌తో న్యూస్‌ రౌండప్‌..

అచ్చెన్నాయుడు ఇంకా మారలేదు: శ్రీకాంత్ రెడ్డి

లోకేశ్‌ దుష్ప్రచారం చేస్తున్నారు: హోంమం‍త్రి సుచరిత

శ్రీ శారదా పీఠం ముందే చెప్పింది

అవినీతి రహిత పాలనను అందిస్తాం: డిప్యూటి సీఎం

ఘనంగా సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం

ఇసుక కొత్త విధానంపై ఉన్నతస్థాయి సమీక్ష

డిప్యూటీ స్పీకర్‌గా కోన ఏకగ్రీవంగా ఎన్నిక!

ఏపీకి టార్చ్‌ బేరర్‌ దొరికారు: రోజా

అలా చూపిస్తే.. సభలో తలదించుకుంటా: బొత్స

సీఎం జగన్‌ నివాసానికి కేసీఆర్‌

బీజేపీలో చేరికకు టీడీపీ నేతల ఆసక్తి

విహార యాత్రలో విషాదం..

జనం కష్టాలు తెలిసిన నేత: జగన్‌

దుర్గమ్మను దర్శించుకున్న కేసీఆర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రయాణం మొదలు

గురువుతో నాలుగోసారి

పచ్చడి తిని ఆఫీసుకెళ్లారు

రాజా నరసింహా

ఆ నమ్మకంతోనే కల్కి విడుదల చేస్తున్నాం

నిర్మాతల మండలి ఎన్నికలు వద్దు