11న ఏపీ కేబినెట్‌ భేటీ

4 Jun, 2020 03:50 IST|Sakshi

లాక్‌డౌన్‌ తర్వాత తొలి సమావేశం

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై నిర్ణయం

సాక్షి, అమరావతి: ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరగనుంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ భేటీ జరగనుంది. లాక్‌డౌన్‌ అనంతరం తొలిసారిగా జరుగుతున్న కేబినెట్‌ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలపై చర్చించి ఖరారు చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించలేని స్థితిలో మూడు నెలల వ్యయానికి ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరుతో బడ్జెట్‌ వ్యయానికి గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాల్సి ఉంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా