పాలిస్తున్న దూడ

2 Jun, 2017 01:48 IST|Sakshi
పాలిస్తున్న దూడ
సాధారణంగా ఆవు దూడలు పుట్టిన ఆరు నెలల వరకు చెంగుచెంగున ఎగురుతూ సందడి చేస్తాయి. సాధారణంగా రెండేళ్ల నుంచి ఆవులు పాలివ్వడం ప్రారంభిస్తాయి. అయితే శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం సంకిలిలో మాత్రం పుట్టిన పది రోజులకే ఓ ఆవుదూడ పాలు ఇస్తోంది. సంకిలి గ్రామానికి చెందిన రైతు గుండ దాలినాయుడుకు చెందిన జర్సీ ఆవుకు మే 23వ తేదీన ఆడ దూడ జన్మించింది.

పుట్టిన మూడు రోజుల తర్వాత దూడలో మార్పులు చోటుచేసుకున్నాయి. పెద్ద ఆవులులాగానే పొదుగు ఏర్పడింది. దీనిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంకిలి పశువైద్య అధికారిణి పి.స్వాతిని సంప్రదించగా జన్యుపరమైన లోపం.. హార్మోన్ల లోపం కారణంగా ఆవు దూడలకు పొదుగు ఏర్పడి పాలు వస్తుంటాయని తెలిపారు.
–రేగిడి (రాజాం)
 
>
మరిన్ని వార్తలు