వీఆర్‌ఓలకు నియామక పత్రాలు

26 Feb, 2014 02:29 IST|Sakshi

 కలెక్టేరేట్,న్యూస్‌లైన్ :
 గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకుల మెరిట్ అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాల పరి శీలన ముగిసింది. మంగళవారం స్థానిక ప్రగతి భవన్‌లో కలెక్టరేట్ కార్యాలయ సూపరింటెండెంట్‌లు, సీనియర్ అసిస్టెం ట్‌లు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు వీఆర్‌ఓల పత్రాల పరిశీలన ప్రారంభించారు. మొతం 65 మందిలో 64 మందిని ఎంపిక చేసి వీఆర్‌ఓలుగా నియామక పత్రాలు అందించారు. ఒక అభ్యర్థి ధ్రువీకరణ పత్రాలు ని బంధనలకు అనుగుణంగా లేనందున తిరస్కరించారు. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ వెంకటేశ్వర్‌రావు పర్యవేక్షించారు.
 
  గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్‌ఏ) మాత్రం  నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఒరి జినల్ సర్టిఫికెట్లను ఉదయం 9 గంటల నుంచి ఆర్ డీఓ యాది రెడ్డి ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలించారు. వీఆర్‌ఏలో 1: 5 శాతం ప్రకారం మెరిట్, రోస్టర్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో 153 మంది మెరిట్ అభ్యర్థులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.  మొత్తం 43 పోస్టులకు గాను అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరి శీలించి 36 మందిని ఎంపిక చేశారు. మిగితా 7 పోస్టులను అభ్యర్థుల వద్ద సరైన వివరాలు లేకపోవడంతో నిలిపి వేశారు. ఎంపికైన 36 మందికి వీఆర్‌ఏలుగా ఆయా మండల తహశీల్దార్‌ల ద్వారా బుధవారం నియామక పత్రాలు అందించనున్నా రు. సెలక్షన్ కమిటీలో నిజామాబాద్ తహశీల్దార్,ఎంపీడీఓ, సెక్షన్ న్ సూపరింటెండెంట్‌లు ఉన్నారు.
 
 కామారెడ్డిలో..
 కామారెడ్డి : వీఆర్‌ఏ పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను మంగళవారం కామారెడ్డిలోని ఆర్డీఓ కార్యాలయం పరిశీలించారు. ఆర్టీఓ వెంకటేశ్వర్లు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వారికి నియామక పత్రాలను అందజేశారు. దోమకొండ మం డలంలో ఏడుగురు, గాంధారి మండలంలో ఇద్దరిని వీఆర్‌ఏ పోస్టులకు ఎంపికచేశారు.
 బోధన్ : వీఆర్‌ఏ పోటీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తన కార్యాలయంలో బోధన్ సబ్ కలెక్టర్ ఇం టర్వ్యూలు నిర్వహించారు. జుక్కల్ మండలానికి సం బంధించి  15 పోస్టులకు గాను 70 మంది  హాజరయ్యారు

>
మరిన్ని వార్తలు