సమస్యలకు పరిష్కారం ఉద్యమమే

9 Jul, 2016 23:34 IST|Sakshi

శృంగవరపుకోట: సమస్యలకు పరిష్కారం ఊడిగం కాదు..ఉద్యమమే అంటూ ఆంద్రప్రదేశ్ మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు  వి.జయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో  ఏపీ మహిళాసమాఖ్య జిల్లా కార్యవర్గ సమా వేశాన్ని  శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సమావేశంలో   సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి మాట్లాడుతూ  మనువు కాలం నంచి పురుషాధిక్య సమాజంలో మహిళ వివక్షకు గురవుతూనే ఉందన్నారు.
 
 అన్ని మతాలు మహిళలకు సమాన హక్కులు లేవనే ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విమల మాట్లాడుతూ పల్లెల్లో మంచినీళ్లు లేకున్నా మద్యం ఏరులై పారుతోందన్నారు. నిత్యవసరాలు నింగిని అంటుతున్నాయని, మహిళల్లో ఆర్థిక స్వావలంబన లేదన్నారు.
 
  పోరాటాలే స్ఫూర్తిగా సాగితేనే సమానహక్కులు సాధ్యమన్నారు.  సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు మద్ది మాణిక్యం అధ్యక్షతన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.రమణమ్మ, మిడ్డే మీల్ వర్కర్స్ యూనియన్   జిల్లా ప్రధానకార్యదర్శి  పి.లక్ష్మి, ఎస్.కోట నియోజకవర్గ అద్యక్షురాలు ఎ.పార్వతి. కార్యదర్శి వాడపల్లి సుధలతో పాటూ సుమారు 200 మంది మహిళా సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు