ఆదుకోండయ్యా

9 Oct, 2018 12:09 IST|Sakshi
భర్తకు గంజి తాపుతున్న భార్య హంసవేణి

క్యాన్సర్‌ బాధితుడి భార్య వేడుకోలు

చిత్తూరు, పలమనేరు: పట్టణంలోని గంటావూరు కాలనీకి చెందిన శంకర, హంసవేణిలు భార్యా భర్తలు. వీరికి ముగ్గురు సంతానం. భర్త తాపీకూలీగా, భార్య కూరగాయలమ్ముతూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునేవారు. ఏడాది క్రితం భర్తకు నడుముకింద చిన్నపాటి గడ్డ ఉండడంతో స్థానిక వైద్యుడి సూచన మేరకు స్విమ్స్‌ ఆస్పత్రికి వెళ్లారు. రోగికి పరీక్షలు నిర్వహించిన ఆంకాలజీ డిపార్ట్‌మెంటు క్యాన్సర్‌గా నిర్ధారించారు. ఆపరేషన్‌ చేయాలని సూచించారు. అయితే వారివద్ద డబ్బులు లేకపోవడంతో ఎన్టీఆర్‌ వైద్యసేవల ద్వారా అదే ఆస్పత్రిలో చేరారు.

కీమోథెరపీ చేయాలని చెప్పి కొన్నాళ్లు పెట్టుకుని ఇక్కడ కుదరదంటూ పంపేశారు. ఇక చేసేదిలేక భర్తను ఇంట్లో ఉంచి కూలీ పనులు చేసుకుంటోంది. భర్త పడుతున్న నరకాన్ని చూసి కుమిలిపోతోంది. దాతల కోసం ఎదురుచూస్తోంది. స్థానికంగా ఉన్న మంత్రి అమరనాథరెడ్డి అయినా ఈమెకు న్యాయం చేయాలని కాలనీవాసులు విన్నవిస్తున్నారు. వైద్య సదుపాయం కల్పించే వారెవరైనా ఉంటే ఆదుకోవాలని హంసవేణి వేడుకుంటోంది( సెల్‌ 09703257343 ).

మరిన్ని వార్తలు