అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత

6 Dec, 2015 16:10 IST|Sakshi

జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.మాడుగుల మండలం ఉరుము జంక్షన్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 150 కేజీల గంజాయిని కారులో తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి తమిళనాడుకు చెందిన ఇళయరాజాగా పోలీసులు గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా